News July 24, 2024

అంబటికి ప్రాణహాని లేదు: పోలీసులు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రాణహాని లేదని పోలీసులు ఏపీ హైకోర్టుకు తెలిపారు. తనకు 4+4 సెక్యూరిటీని కొనసాగించాలని కోరుతూ అంబటి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిటిషనర్ విజ్ఞప్తిని గుంటూరు ఎస్పీ పరిశీలించారని, ఎటువంటి ప్రాణహాని లేదని తేల్చారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. కేసులో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది.

Similar News

News January 25, 2026

APPLY: టెన్త్ అర్హతతో 572 పోస్టులు

image

RBIలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో 36 పోస్టులున్నాయి. టెన్త్ పాసైన వారు అర్హులు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: rbi.org.in

News January 25, 2026

ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి: CS

image

AP: ప్రజాస్వామ్య పటిష్ఠతకు ఓటు హక్కు వినియోగమే పునాది అని సీఎస్ విజయానంద్ చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘18 ఏళ్లు నిండిన వారు JAN 1, APR 1, JULY 1, OCT 1న ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. Form-8 ద్వారా చిరునామాను మార్చుకోవచ్చు. EPIC కార్డ్ ఉండటం వల్ల ఓటు హక్కు రాదు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో <>వెబ్‌సైట్‌లో<<>> తనిఖీ చేసుకోవాలి’ అని సూచించారు.

News January 25, 2026

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్న భారత్‌.. కానీ

image

ఇటీవల జపాన్‌ను దాటి నాలుగో స్థానానికి చేరిన భారత్, 2028లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. అయినా తలసరి ఆదాయం తక్కువగానే ఉంది. దీనికి కారణం 140 కోట్ల మందిపై GDP పంచుకోవాల్సి రావడం. అదే విధంగా దాదాపు 46% మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నా వారి ఆదాయం తక్కువగా ఉంది. 80% పైగా ఉద్యోగాలు సరైన గుర్తింపు లేనివి కాగా కేవలం IT, ఫినాన్స్ వంటి రంగాల్లోనే సంపద కేంద్రీకరణ అయి ఉంది.