News July 12, 2024

గాంధీభవన్‌కు, తెలంగాణ భవన్‌కు తేడా లేదు: కిషన్ రెడ్డి

image

MLAల ఫిరాయింపులో KCR బాటలోనే కాంగ్రెస్‌ కూడా వెళ్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దీంతో గాంధీ భవన్‌కు, తెలంగాణ భవన్‌కు తేడా లేకుండా పోయిందన్నారు. ‘పదేళ్లు పాలించిన BRS లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయింది. అటు INC అతితక్కువ టైంలోనే ప్రజావిశ్వాసం కోల్పోయింది. రాష్ట్రంలో BJP ఓటు బ్యాంక్ 14 నుంచి 35%కి పెరగడం సాధారణ విషయం కాదు’ అని శంషాబాద్‌లో పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు.

Similar News

News November 23, 2025

URDIPలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు

image

CSIR-యూనిట్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్(URDIP) 3ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తోంది. కెమికల్/ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో పీజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత గల వారు డిసెంబర్ 16న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://urdip.res.in/

News November 23, 2025

భూమిలో కర్బన నిల్వల స్థాయి టెస్టింగ్ ఇలా..

image

ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్‌తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు. ☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ ☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం ☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.

News November 23, 2025

2 రోజుల్లోనే ముగిసిన టెస్టు.. రూ.17.35 కోట్ల నష్టం!

image

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు కేవలం 2 రోజుల్లో ముగియడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియాకు భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగో రోజులకు అమ్మకానికి ఉంచిన టికెట్‌ ఆదాయం కోల్పోవడంతో దాదాపు రూ.17.35 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. మూడో రోజు టికెట్లు దాదాపు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొదటి రెండు రోజుల్లోనే లక్షకుపైగా అభిమానులు హాజరైనా, తర్వాతి రోజుల ఆదాయం కోల్పోవడం గట్టిదెబ్బే.