News March 22, 2024
మోదీ, కేసీఆర్‌కు తేడా లేదు: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో KCR శకం ముగిసిందని, ఇక ఏం చేసినా ఆయనను ప్రజలు నమ్మరని CM రేవంత్ అన్నారు. ‘KCR అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని అప్పులపాలు, అవినీతిమయం చేశారు. మోదీ, ఆయన ఒకే రకమైన నేతలు. అప్రజాస్వామిక విధానాలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో వారిద్దరికి తేడా లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
Similar News
News April 17, 2025
SRH స్కోర్ ఎంతంటే?

ముంబైతో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్(40), క్లాసెన్(37) ఫర్వాలేదనిపించినా హెడ్(29 బంతుల్లో 28), నితీశ్(19), కిషన్(2) విఫలమయ్యారు. ఓ దశలో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో SRH బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. చివర్లో అనికేత్ 8 బంతుల్లో 18 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు నమోదైంది. విల్ జాక్స్ 2 వికెట్లు తీశారు. MI టార్గెట్ 163.
News April 17, 2025
534 పోస్టుల భర్తీకి కేంద్రం ఆదేశాలు

AP: మంగళగిరి ఎయిమ్స్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విన్నపంతో 534 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి సహకరించిన కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, జేపీ నడ్డాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News April 17, 2025
తెలుగులోకి మలయాళ సూపర్ హిట్ చిత్రం!

మలయాళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘అలప్పుజ జింఖానా’ తెలుగులో రిలీజ్ కానుంది. ఇప్పటికే రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఈ నెల 25న తెలుగులో విడుదల కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.