News March 27, 2025

రాష్ట్రం దివాలా తీసింది అనడానికి ఆధారాల్లేవు: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అప్పులకు తగినట్లే సంపద పెరిగిందని అసెంబ్లీలో చెప్పారు. అప్పులు లేని వ్యక్తి, దేశం ఉండదని అన్నారు. అమెరికాలాంటి దేశాలు కూడా అప్పులు చేశాయన్నారు. రాష్ట్ర ఏర్పడిన రోజు సగటు ఆదాయం రూ.3,500 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.18వేల కోట్లు ఉందన్నారు. రాష్ట్రం దివాలా తీసిందని అనడానికి ఆధారాలు లేవని చెప్పారు.

Similar News

News January 24, 2026

IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

image

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<>IREL<<>>) 30 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, BCom, BSc, MBA, PG, డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు NATS/NAPS పోర్టల్‌లో మార్చి 15వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.irel.co.in/

News January 24, 2026

రథసప్తమి నాడు అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే..?

image

సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనది అర్ఘ్యం. రథసప్తమి నాడు రాగి పాత్రలోని శుద్ధ జలంలో ఎర్ర పూలు, రక్తచందనం, అక్షతలు కలిపి సూర్యునికి నమస్కరించాలి. శివపురాణంలోని మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఆవు పాల క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల సూర్యుడు ప్రసన్నుడవుతాడని నమ్మకం. ఇలా అర్ఘ్య ప్రదానం చేస్తే ఆయురారోగ్యాలు, కంటి చూపు మెరుగుపడి విశేష తేజస్సు లభిస్తుందని మన శాస్త్రం చెబుతోంది.

News January 24, 2026

అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.