News April 17, 2025
గిట్టుబాటు ధర లేదు.. ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించట్లేదు: బొత్స

AP: కూటమి నేతల మాటలకు, చేతలకు పొంతన లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలు డబ్బు డిమాండ్ చేస్తుండటంతో పరిశ్రమలు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారని, ఉపాధి కూలీలకూ డబ్బులు చెల్లించట్లేదని ఫైరయ్యారు. 10 నెలల్లో ఒక్కరికైనా కొత్తగా పెన్షన్ ఇచ్చారా? అని నిలదీశారు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
Similar News
News April 19, 2025
విచారణకు హాజరైన మిథున్ రెడ్డి

AP: మద్యం కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.
News April 19, 2025
వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడకూడదు: హైకోర్టు

వివాహేతర సంబంధం నేరమేమీ కాదని, అది నైతికతకు సంబంధించిన అంశమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మహాభారత కాలంలోలాగా భార్యను భర్త ఆస్తిలాగా చూడకూడదని స్పష్టం చేసింది. కాగా తన భార్య మరో వ్యక్తితో హోటల్‌లో శారీరకంగా దగ్గరైందని, వారిని శిక్షించాలని భర్త మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ కోర్టు ప్రియుడికి నోటీసులు పంపింది. దీనిపై ప్రియుడు హైకోర్టుకు వెళ్లగా అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
News April 19, 2025
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే..

పురుషుల్లో ఒంటరితనం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలలో సంతానోత్పత్తి, గర్భాశయ సమస్యలు అధికమవుతాయి. లేటు మ్యారేజ్‌లో భాగస్వామితో గొడవలు, డివోర్స్ అవకాశాలు ఎక్కువట. మరోవైపు కుటుంబం, సమాజం నుంచి కూడా ప్రశ్నలు, విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. 30 ఏళ్లు దాటాక మనసుకు నచ్చకపోయినా వచ్చిన సంబంధాన్ని ఒప్పుకోక తప్పదు. రాజీపడాల్సి వస్తుంది.