News November 25, 2024
ఏడు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్షం లేదు
దేశంలో ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే AP, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కిం ఈ జాబితాలో ఉండగా తాజాగా మహారాష్ట్ర చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం MLA స్థానాల్లో పది శాతం సీట్లను దక్కించుకోవాలి. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా 29 సీట్లు గెలవాల్సి ఉంది. అయితే శివసేన(UBT)కు 20, కాంగ్రెస్‌కు 16, NCP(SP)కి 10 స్థానాలు మాత్రమే వచ్చాయి.
Similar News
News November 25, 2024
తక్కువ ధరకే అమ్ముడైన టాలెంటెడ్ ప్లేయర్స్
IPL వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు టాలెంటెడ్ ప్లేయర్లను తక్కువ ధరకే దక్కించుకున్నాయి. ఆల్‌రౌండర్ మార్క్రమ్ను లక్నో(రూ.2కోట్లు), కీలక ఇన్నింగ్స్ ఆడే త్రిపాఠిని CSK(రూ.3.4కోట్లు) కొనుగోలు చేసింది. భారీ సిక్స్‌లు కొట్టే మ్యాక్స్‌వెల్‌ను PBKS రూ.4.2కోట్లకు, Mమార్ష్‌ను లక్నో రూ.3.4కోట్లకే సొంతం చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ డికాక్‌ను KKR రూ.3.60కోట్లు, రచిన్ రవీంద్రను CSK రూ.4కోట్లకే ఖాతాలో వేసుకున్నాయి.
News November 25, 2024
నోటీసులపై నటుడు అలీ స్పందన
అక్రమ నిర్మాణాలు ఆపాలని తనకు జారీ చేసిన నోటీసులపై నటుడు అలీ స్పందించారు. ఒక కన్వెన్షన్ సెంటర్ కోసం తన స్థలం లీజుకు ఇచ్చినట్లు చెప్పారు. కట్టడాలపై లీజుదారులే సమాధానం ఇస్తారన్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ (M) ఎక్మామిడిలోని ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకి నిన్న నోటీసులిచ్చారు. కట్టడాలను నిలిపివేయాలని అందులో పేర్కొన్న విషయం తెలిసిందే.
News November 25, 2024
శ్రీవారి దర్శనానికి 10 గంటల టైమ్
AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండలవాడిని నిన్న 75,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,096 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు లభించింది.