News March 21, 2025
ఆ రోడ్లకు టోల్ విధించే ఆలోచన లేదు: మంత్రి కోమటిరెడ్డి

TG: గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే రోడ్లు వేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వాటికి చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని అసెంబ్లీలో దుయ్యబట్టారు.
Similar News
News November 3, 2025
బాత్రూమ్లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకంటే?

బాత్రూమ్లో ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి స్నానం ప్రధాన కారణం కాదని, మలమూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఈ ఒత్తిడి వల్ల ‘వాల్సాల్వా మ్యాన్యువర్’ జరిగి రక్తపోటులో ఆకస్మిక హెచ్చుతగ్గులు సంభవిస్తాయని తెలిపారు. దీనివల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయిన వారికి ఆక్సిజన్ సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
News November 3, 2025
ఇవాళే సీఏ ఫైనల్ ఫలితాలు

ICAI సెప్టెంబర్ సెషన్ 2025 సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు విడుదల కానున్నాయి. ఫౌండేషన్ స్థాయి ఫలితాలు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. వెబ్సైట్: https://icai.nic.in/
News November 3, 2025
వరల్డ్ కప్‌తో నిద్రలేచిన ప్లేయర్లు

అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా.. భారత మహిళా జట్టుకు కలగా ఉన్న వరల్డ్ కప్ నిన్నటి మ్యాచ్‌తో సాకారమైంది. రాత్రంతా సెలబ్రేషన్స్‌తో అలసిపోయి పొద్దున్నే నిద్ర లేచిన ప్లేయర్లు చేతిలో వరల్డ్ కప్‌లో బెడ్‌పై నుంచే ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘ఇంకా మనం కలలు కంటున్నామా?’ అని క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఫొటోలో అరుంధతి, రాధా యాదవ్, స్మృతి మంధాన ఉన్నారు.


