News July 29, 2024

విజయమ్మతో భేటీలో రాజకీయ కోణం లేదు: జేసీ ప్రభాకర్

image

AP: వైఎస్ విజయమ్మతో జరిగిన భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాను. అక్కడ వెయిటింగ్ లాంజ్‌లో విజయమ్మ కనిపించారు. ఆమెను పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నాను’ అని Xలో పేర్కొన్నారు. వీరి భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Similar News

News December 24, 2025

డిసెంబర్ 24: చరిత్రలో ఈ రోజు

image

✒ 1924: లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ జననం(ఫొటోలో)
✒ 1956: నటుడు, నిర్మాత అనిల్ కపూర్ జననం
✒ 1987: తమిళనాడు మాజీ సీఎం, నటుడు ఎంజీ రామచంద్రన్ మరణం
✒ 2002: ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రారంభించిన ప్రధాని వాజ్‌పేయి
✒ 2005: ప్రముఖ నటి భానుమతి మరణం
✒ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

News December 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 24, 2025

రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్: నితిన్ నబీన్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ విమర్శించారు. ఎన్నికలప్పుడు ఆయన బిహార్‌ వచ్చారని, ఆ తర్వాత దేశం విడిచి వెళ్లారని ఆరోపించారు. ‘దేశంలో ఉంటే ఎన్నికల కమిషన్‌ను నిందిస్తారు. సుప్రీంకోర్టును విమర్శిస్తారు. రానున్న ఎన్నికల్లో బెంగాల్, కేరళ ఓటర్లు కూడా రాహుల్‌కు శిక్ష విధిస్తారు’ అని పట్నాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.