News January 17, 2025
సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేవు: పోలీసులు
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో CCTV కెమెరాలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ముంబై పోలీసులు వెల్లడించారు. విజిటర్స్ను చెక్ చేసేందుకు, ఎమర్జెన్సీ సమయంలో వెంటనే స్పందించేందుకు వారి ఫ్లాట్ ముందు పర్సనల్ గార్డ్స్ కూడా లేరని తెలిపారు. ఆ బిల్డింగ్కు వచ్చే వారి వివరాలు నమోదు చేసేందుకు లాగ్ బుక్ కూడా లేదని చెప్పారు. సెలబ్రిటీలు సెక్యూరిటీ పెట్టుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
Similar News
News January 17, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ పార్టీలో మహేశ్ బాబు
చాలారోజుల తర్వాత విక్టరీ వెంకటేశ్, ప్రిన్స్ మహేశ్ బాబు ఒకేచోట చేరి సందడి చేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్ అయింది. అప్పటి నుంచి వెంకీ, మహేశ్ను పెద్దోడు, చిన్నోడు అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. తాజాగా పెద్దోడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ పార్టీలో చిన్నోడు మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మేకర్స్ Xలో పోస్ట్ చేశారు.
News January 17, 2025
సీఎం చంద్రబాబు సీరియస్
AP: తనతో సమావేశానికి కొందరు ఎంపీలు హాజరుకాకపోవడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమైన భేటీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. వచ్చే సమావేశానికి ఇది రిపీట్ కాకూడదని చెప్పారు. జిల్లా అభివృద్ధి బాధ్యత MP, ఇన్ఛార్జ్ మంత్రి, కలెక్టర్, జిల్లా మంత్రిదేనని స్పష్టం చేశారు. కొందరు MLAలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఎంపీ, ఇన్ఛార్జ్ మంత్రులదేనని సీఎం తేల్చి చెప్పారు.
News January 17, 2025
‘సంచార్ సాథీ’ యాప్ ప్రారంభం.. ఉపయోగాలివే
స్కామ్ కాల్స్, మెసేజ్లను అడ్డుకునేందుకు వీలుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ‘సంచార్ సాథీ’ యాప్ను ఆవిష్కరించారు. మీకు ఏవైనా అనుమానిత కాల్స్ వస్తే ఈ యాప్లో లాగినై నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. మొబైల్ పోయినప్పుడు వెంటనే బ్లాక్ చేసే వీలుంది. మీ పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకుని, అనధికార నంబర్లపై ఫిర్యాదు చేసే వీలుంది. IMEI నంబర్ ఎంటర్ చేసి మొబైల్ ప్రామాణికతను కూడా గుర్తించొచ్చు.