News March 18, 2024
గాజాలో దాడులు ఆపేదే లేదు: నెతన్యాహు

గాజాపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ‘అంతర్జాతీయ ఒత్తిళ్లకు మేం తలొగ్గం. యుద్ధంలో మా లక్ష్యాన్ని మధ్యలోనే ఆపలేం. గాజాపై దాడుల విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడిని పట్టించుకోం. మరికొన్ని వారాలపాటు దాడులు కొనసాగిస్తాం. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన భీకర దాడులు అందరూ మర్చిపోవచ్చు. కానీ మేం అంత త్వరగా మర్చిపోం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
3 రోజుల్లో రూ.103 కోట్ల కలెక్షన్లు

రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు 3 రోజుల్లో రూ.103 కోట్లు (గ్రాస్) వచ్చినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. సినిమా విడుదలైన తొలిరోజు శుక్రవారం (రూ.28 కోట్లు) కంటే ఆదివారం (రూ.43 కోట్లు) ఎక్కువ వసూళ్లు వచ్చాయి. స్పై కథాంశంతో ఆదిత్య ధార్ ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఈ చిత్రం తెలుగులో విడుదల కాలేదు.
News December 8, 2025
మైక్రోసైటిక్ అనీమియా గురించి తెలుసా?

మైక్రోసైటిక్ అనీమియా వల్ల శరీరంలో రక్త కణాల పరిమాణం తగ్గుతుంది. దీంతో శరీరంలో ఆక్సిజన్ తగ్గి అలసట, మైకము, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమేకాకుండా అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపం కారణంగా కూడా మైక్రోసైటిక్ అనీమియా తలెత్తే అవకాశం ఉంటుంది.
News December 8, 2025
ఈ హాస్పిటల్లో అన్నీ ఉచితమే..!

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.


