News December 28, 2024
డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు.. దాన్ని నమ్మొద్దు: డీజీపీ
AP: దేశంలో తొలిసారి మనమే స్మార్ట్ పోలీస్ ఏఐ వినియోగిస్తున్నామని డీజీపీ ద్వారకాతిరుమల రావు తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. నేర నమోదు నుంచి కేసు విచారణ వరకు స్టార్మ్ పోలీస్ ఏఐ సాయం చేస్తుందన్నారు. ఇక డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి వాటిని నమ్మొద్దని డీజీపీ సూచించారు. ఈ ఏడాది 916 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని, వీటి ద్వారా నేరస్థులు రూ.1229Cr తస్కరించారన్నారు.
Similar News
News December 29, 2024
భారీగా తగ్గిన ధరలు.. కేజీ రూ.5
AP: పలు ప్రాంతాల్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు హోల్ సేల్ వ్యాపారులకు కేజీ రూ.5కే విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు KG రూ.8కి కొనాలన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ రూ.10-15 వరకు పలుకుతోంది. పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతుంటే, కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News December 29, 2024
విభజన రాజకీయాలు ప్రమాదం: SC న్యాయమూర్తి
మతం, కులం, జాతి ఆధారిత విద్వేష వ్యాఖ్యలు దేశ ఐక్యతా భావాలకు పెను సవాల్ విసురుతున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు. గుజరాత్లో ఓ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం రాజకీయ నాయకులు చేసే ఈ రకమైన రాజకీయం సమాజంలో విభజనను పెంచుతుందన్నారు. విభజన సిద్ధాంతాలు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, సామాజిక అన్యాయం సోదర భావానికి ప్రమాదమన్నారు.
News December 29, 2024
షిప్ నుంచి రేషన్ బియ్యం అన్లోడ్
AP: కాకినాడలో స్టెల్లా షిప్లో ఇటీవల భారీ మొత్తంలో అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ అక్రమరవాణాపై ఏకంగా Dy.CM పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రేషన్ బియ్యాన్ని షిప్ నుంచి అన్లోడ్ చేశారు. మొత్తం 1,320 టన్నుల బియ్యాన్ని పోర్టులోని గోడౌన్లో భద్రపరిచారు. మరోవైపు షిప్లో 19,785 టన్నుల బియ్యం లోడ్ చేసేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.