News July 19, 2024

రత్న భాండాగార్‌లో అలాంటివేం లేవు: జస్టిస్ రథ్

image

పూరీలోని రత్న భాండాగార్‌లో సర్పాలు, విష కీటకాలు, రహస్య సొరంగ మార్గాలు లాంటివి ఏమీ లేవని సూపర్‌వైజరీ కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఆలయం లోపల సొరంగ మార్గాలు ఏమైనా ఉంటే ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ చేస్తే తెలుస్తుందన్నారు. సంపదనంతా భద్రపరిచి సీల్ చేయించామని చెప్పారు. సంపద వివరాలు ఎక్కడా బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందున వాటి వివరాలు వెల్లడించలేమని తెలిపారు.

Similar News

News January 23, 2025

అక్బర్, ఔరంగజేబు గురించి మనకెందుకు: అక్షయ్ కుమార్

image

దేశంలో చరిత్ర పుస్తకాలను మార్చాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ హిస్టరీ బుక్స్‌లో అక్బర్, ఔరంగజేబు గురించి చదువుకోవడం అవసరమా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ‘స్కై ఫోర్స్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘చరిత్రలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల గురించి పాఠాలు ఉండాలి. పరమవీరచక్ర అవార్డు పొందిన వారి కథనాలు ప్రచురించాలి’ అని పేర్కొన్నారు.

News January 23, 2025

భార్యను ముక్కలుగా నరికిన భర్త.. కారణం ఇదే!

image

TG: జిల్లెలగూడలో మాధవి <<15230164>>హత్య కేసులో<<>> పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన మాధవి సంక్రాంతికి పుట్టింటికి వెళ్తానని అడగ్గా భర్త గురుమూర్తితో గొడవ జరిగిందని చెప్పారు. ఆ కారణంతోనే భార్యను చంపినట్లు భావిస్తున్నారు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. గురుమూర్తికి వేరే మహిళతో సంబంధం ఉందని కూడా అనుమానిస్తున్నారు.

News January 23, 2025

త్వరలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్: లోకేశ్

image

AP: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దావోస్‌లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. ‘రాష్ట్రంలోని వైజాగ్, విజయవాడ, తిరుపతిలో భారీగా కోవర్కింగ్ స్పేస్ ఉంది. కాగ్నిజెంట్ విస్తరణలో భాగంగా ఇక్కడ కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సీఈఓ తెలిపారు’ అని పేర్కొన్నారు.