News August 14, 2024
ఆ ప్రచారంలో నిజం లేదు: RTC MD సజ్జనార్
TG: బస్సు డిపోలు ప్రైవేట్ పరమవుతాయనే ప్రచారంలో నిజం లేదని RTC MD సజ్జనార్ స్పష్టం చేశారు. TGSRTC ఆధ్వర్యంలోనే బస్సుల నిర్వహణ ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదన్నారు. ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్, డీజిల్ బస్సులు నడుస్తాయన్నారు. ప్రైవేట్ అద్దె బస్సుల్లాగే ఎలక్ట్రిక్ బస్సులన్నీ TGSRTC ఆధ్వర్యంలోనే నడుస్తాయని, ఆదాయం నేరుగా సంస్థకే వస్తుందని వెల్లడించారు.
Similar News
News January 21, 2025
కోర్టు తీర్పుపై మమతా బెనర్జీ అసహనం
R.G.Kar ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవితఖైదు విధించటం పట్ల బెంగాల్ CM మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసు ‘అత్యంత అరుదు’ కాదన్న కోర్టు తీర్పు షాక్‌కు గురి చేసిందని చెప్పారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పార్టీ మెుదటి నుంచి దోషికి మరణశిక్ష విధించాలనే డిమాండ్ చేస్తుందని చెప్పారు. ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు మమత ట్వీట్ చేశారు.
News January 21, 2025
భారత్ నుంచి బ్రిటిషర్లు దోచుకున్న సంపద 64 ట్రిలియన్ డాలర్స్!
మన దేశం నుంచి ఎంత సంపద బ్రిటిషర్లకు చేరిందో తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 1765 నుంచి 1900 సం. మధ్యలో 64.2 ట్రిలియన్ డాలర్లు భారత్ నుంచి ఆ దేశానికి వెళ్లాయని Oxfam గ్రూప్ తెలిపింది. ఇందులో సగం అంటే 33.8 ట్రి.డా. 10% ధనవంతులే దోచుకున్నారని పేర్కొంది. ఈ డబ్బును లండన్ నగరమంతా 50 పౌండ్ల నోట్లతో పరిచినా ఇంకా 4 రెట్ల కరెన్సీ మిగిలి ఉంటుందని వివరించింది. 1 ట్రిలియన్ డాలర్ అంటే లక్ష కోట్లతో సమానం.
News January 21, 2025
గుమ్మడి గింజలతో ఎంతో ఆరోగ్యం
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతాయి. పండ్లు, ఆకుకూర సలాడ్లలో గుమ్మడికాయ గింజలను కలిపి తింటే ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. అలాగే జీర్ణక్రియ మెరుగవ్వడానికీ ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకుంటే చర్మం నిగనిగలాడుతుందని వైద్యులు చెబుతున్నారు.