News July 10, 2024
జగన్ రాజీనామా వార్తల్లో నిజం లేదు: YCP నేత
AP: మాజీ CM, YCP అధినేత YS జగన్ తన MLA పదవికి రాజీనామా చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ పార్టీ సీనియర్ నేత సురేశ్‌బాబు స్పష్టం చేశారు. జగన్ కడప MPగా పోటీ చేస్తారనేది శుద్ధ అబద్ధమన్నారు. సోషల్ మీడియాలో TDP దుష్ప్రచారం చేయడం, దానిపై CM రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమన్నారు. YS కుటుంబంలో చిచ్చుపెట్టేలా రేవంత్ వ్యాఖ్యలున్నాయని, ఆయన APలో గల్లీగల్లీ తిరుగుతాననడం హాస్యాస్పదమన్నారు.
Similar News
News January 19, 2025
ట్రంప్‌తో ముకేశ్- నీతా అంబానీ
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు వివిధ దేశాల ప్రముఖులు హాజరుకానున్నారు. అయితే, దీనికి ముందే ట్రంప్ ఏర్పాటు చేసిన ‘క్యాండిల్ లైట్ డిన్నర్’కు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో వీరు దిగిన ఫొటో వైరలవుతోంది. కాగా, ప్రమాణస్వీకారోత్సవం తర్వాత మార్క్ జుకర్‌బర్గ్ ఇచ్చే డిన్నర్‌లోనూ వీరు పాల్గొననున్నారు.
News January 19, 2025
‘పరీక్షా పే చర్చ’కు భారీగా అప్లికేషన్లు
ప్రధాని మోదీ నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి 3.5 కోట్లకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సందర్భంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ చర్చిస్తారు. కాగా పరీక్షా పే చర్చా ఎడిషన్-8 నిర్వహణ తేదీ ఇంకా ప్రకటించలేదు.
News January 19, 2025
చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్ విడుదలవగా చాలా చోట్ల హౌస్ ఫుల్‌గా నడుస్తోంది. దీంతో రిలీజైన 45వ రోజున కూడా ఓ సినిమాకు హౌస్ ఫుల్ పడటం ఇదే తొలిసారి అని సినీవర్గాలు పేర్కొన్నాయి. 20+నిమిషాలు యాడ్ అవడం సినిమాకు ప్లస్ అయినట్లు తెలిపాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.