News August 19, 2025

ఆ ఆరోపణల్లో నిజం లేదు: ధర్మస్థల ఆలయ చీఫ్

image

కర్ణాటక ధర్మస్థలలో గత రెండు దశాబ్దాలుగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలను ఆలయ చీఫ్ వీరేంద్ర హెగ్గడే ఖండించారు. దీనిపై SIT దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ‘మాపై తప్పుడు ప్రచారం జరగడం ఎంతో బాధించింది. వీలైనంత త్వరగా నిజం బయటకు రావాలి. ధర్మస్థలలో చనిపోతే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఎవరైనా చనిపోతే పంచాయతీ సిబ్బంది ఆ మృతదేహాలను పూడ్చిపెట్టేవారు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Similar News

News August 19, 2025

మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి

image

AP: 4,687 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. టెన్త్ ఉత్తీర్ణులైన వారు ఇందుకు అర్హులని వెల్లడించింది. ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న వీరు ఇకపై ₹11,500 అందుకోనున్నారు. దీంతో పాటు 10 మంది కంటే తక్కువ విద్యార్థులున్న మినీ అంగన్‌వాడీలు, 1 KM పరిధిలోని మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాల్లో కలపాలని ప్రభుత్వం GOలో పేర్కొంది.

News August 19, 2025

ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్

image

ఎయిర్‌టెల్ ₹249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇది అందుబాటులో ఉండదని థాంక్స్ యాప్, వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ప్లాన్ కింద 28 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1GB డేటా అందిస్తోంది. మరో 2 గంటలు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కాగా ఇప్పటికే JIO సైతం ₹249 ప్లాన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వోడాఫోన్ ఐడియా కూడా ఈ ప్లాన్‌ను రద్దు చేసే అవకాశముంది.

News August 19, 2025

సర్పంచ్ ఎన్నికలు.. సీఎం కీలక వ్యాఖ్యలు

image

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. ‘ఈ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో వాటిని రాష్ట్రపతి పూర్తి చేయాలి. ఆలస్యం అయితే పార్టీ పరంగా ఇచ్చేందుకు అందరినీ కోరి స్థానిక ఎన్నికలకు వెళ్లడమే మా ముందున్న ప్రత్యామ్నాయం. ఆగస్టు 23న జరిగే PAC భేటీలో దీనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని CM తెలిపారు.