News September 16, 2024
ఆ ప్రకటనల్లో నిజం లేదు: సల్మాన్ ఖాన్

త్వరలో USAలో జరగబోయే కన్సర్ట్స్లో తాను ప్రదర్శన ఇవ్వనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రదర్శనలు ఇస్తున్నారనే ప్రకటనలను, ఈవెంట్లకు సంబంధించిన ఈమెయిల్స్ను నమ్మవద్దని కోరుతూ ఆయన టీం ప్రకటన విడుదల చేసింది. సల్మాన్ ఖాన్ పేరును మోసపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News November 29, 2025
‘దిత్వా’ తుఫాను.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: ‘దిత్వా’ తుఫాను ప్రభావంతో 3 రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. నేడు CTR, TPT, ప్రకాశం, NLR, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నెల్లూరు, CTR, TPT, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
News November 29, 2025
బాలయ్య రోల్లో విజయ్ సేతుపతి!

రజినీకాంత్ ‘జైలర్-2’ సినిమాలో గెస్ట్ రోల్ కోసం మొదట బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బిజీ షెడ్యూల్ కారణంగా బాలయ్య ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్లేస్లో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి చేస్తున్నారని, ఇప్పటికే షూటింగ్లో కూడా పాల్గొన్నారని సమాచారం. నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2026 సమ్మర్లో విడుదల కానుంది.
News November 29, 2025
PHOTO: సిద్ద-శివ బ్రేక్ఫాస్ట్ మీట్

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారం వేళ సిద్దరామయ్య, డీకే శివకుమార్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. సిద్ద ఆహ్వానం మేరకు శివకుమార్ ఆయన నివాసానికి వెళ్లారు. సీఎం, డిప్యూటీ సీఎం ఏం మాట్లాడుకున్నారనేది తెలియాల్సి ఉంది. సీఎం కుర్చీపై వారిద్దరే తేల్చుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కుర్చీ వదులుకోవడానికి సిద్ద అంగీకరిస్తారా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.


