News June 10, 2024

కేబినెట్‌లో ఒక్క ముస్లిం MP కూడా లేరు: రాజదీప్ సర్దేశాయ్

image

భారత రాజకీయాల్లో పదేళ్లుగా ముస్లింలకు ప్రాధాన్యం తగ్గిందని జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ అన్నారు. ఈసారి మోదీ కేబినెట్‌లో ఒక్క ముస్లిం MPకి కూడా చోటు దక్కలేదని ట్వీట్ చేశారు. అయితే NDA నుంచి పోటీ చేసిన ముస్లిం అభ్యర్థులెవరూ గెలుపొందలేదని, అందుకే వారికి కేబినెట్‌లో చోటు దక్కలేదని కూటమి వర్గాలు అంటున్నాయి. ఈసారి క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన వారిలో ఐదుగురికి చోటు దక్కింది.

Similar News

News September 13, 2025

మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

image

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 – 2010 మధ్య 4 సార్లు CMగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.

News September 13, 2025

మైథాలజీ క్విజ్ – 4

image

1. అర్జునుడు తపస్సు చేసి, ఎవర్ని ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రాన్ని పొందాడు?
2. శూర్పణఖ ఎవరి చెల్లి?
3. ‘త్రిసూర్ పురం’ అనే పండగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ‘నవకళేబర’ ఉత్సవం ఏ ఆలయంలో జరుగుతుంది?
5. హిరణ్యాక్షుణ్ని వధించిన విష్ణు అవతారం ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను ‘మైథాలజీ క్విజ్-5’(రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.

News September 13, 2025

నేడు మణిపుర్‌లో ప్రధాని మోదీ పర్యటన

image

ప్రధాని మోదీ ఇవాళ మణిపుర్‌లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్‌పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.