News April 24, 2024

విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడంలో తప్పులేదు.. కానీ..: వెంకయ్య

image

ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడంలో తప్పులేదని, కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచితాలు ఏమాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. హామీల అమలుకు నిధులు లేక మళ్లీ అప్పులు చేయడం సరికాదని వెంకయ్య అన్నారు.

Similar News

News March 27, 2026

వరుణ్ ధవన్ కూతురికి ఆరోగ్య సమస్య.. నడవలేక..

image

తన కూతురు లారాకు DDH (డెవలప్‌మెంటల్ డిస్‌ప్లేసియా ఆఫ్ ది హిప్) అనే ఆరోగ్య సమస్య వచ్చిందని బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తెలిపారు. ‘దీని వల్ల ఒక కాలు పొట్టిగా అవుతుంది. సరిగ్గా నడవలేకపోయింది. డాక్టర్లు సర్జరీ అవసరం లేకుండానే వైద్య ప్రక్రియతో తుంటిని యథాస్థానానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోలుకుంటోంది. దీనిపై నేనొక పుస్తకం రాయాలనుకుంటున్నా’ అని వివరించారు. 2024లో వరుణ్, నటాషాకు లారా జన్మించింది.

News March 27, 2026

DDH అంటే ఏంటి?

image

<<19493931>>DDH<<>> (డెవలప్‌మెంటల్ డిస్‌ప్లేసియా ఆఫ్ ది హిప్) అనేది చిన్న పిల్లల్లో తుంటి జాయింట్ సరిగ్గా ఏర్పడకపోవడం లేదా కదలడం వల్ల వచ్చే సమస్య. పుట్టుకతో వచ్చే హిప్‌ డిస్‌లొకేషన్ అని కూడా అంటారు. తుంటి ఎముకలోని సాకెట్‌లో తొడ ఎముక పైభాగం సరిగ్గా సెట్ కాకుండా పక్కకు లేదా బయటకు వస్తుంటుంది. దీని వల్ల నడకలో ఇబ్బందులు వస్తాయి. ఆర్థరైటిస్‌కు దారితీయొచ్చు. ముందే గుర్తించడం ద్వారా చికిత్స, సర్జరీతో నయం చేయొచ్చు.

News March 27, 2026

ఒట్రోవర్ట్స్ గురించి తెలుసా?

image

మనుషుల్లో ఇన్‌ట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్సే కాకుండా ఒట్రోవర్ట్స్ కూడా ఉంటారని US సైకియాట్రిస్ట్ రమీ కమిన్స్కీ చెబుతున్నారు. ‘అందరితో కలిసిపోయినట్లు కనిపిస్తారు. గ్రూపుల్లో యాక్టివ్‌గా, మిగతావారితో కలివిడిగా ఉంటారు. కానీ లోపల మాత్రం వారి అనుభవం వేరుగా ఉంటుంది. తమ నిజమైన స్వభావానికి ప్రాధాన్యం ఇస్తారు. భావోద్వేగాల పరంగా స్వతంత్రంగా ఉంటారు’ అని కమిన్స్కీ వివరించారు. మరి మీరూ ఒట్రోవర్టా?