News September 16, 2024
బుమ్రాలాంటి బౌలర్ తరానికొక్కరే ఉంటారు: అశ్విన్

టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. అలాంటి బౌలర్ తరానికొక్కరే వస్తారని, వారి గొప్పదనాన్ని అందరూ గుర్తించాలని అభిప్రాయపడ్డారు. ‘భారత్ ఎప్పుడూ బ్యాటర్లకే స్టార్ స్టేటస్ ఇస్తుంటుంది. అది ఎప్పటికీ మారదు. కానీ బౌలర్ అయిన బుమ్రాకు కూడా గౌరవం దక్కుతుండటం ఆనందంగా ఉంది. నా దృష్టిలో ప్రస్తుతం అతడే అత్యంత విలువైన భారత క్రికెటర్’ అని పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలి: CBN

AP: TDP పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం చంద్రబాబు ఎంపీలకు కీలక సూచనలు చేశారు. DEC 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలే ఎజెండాగా తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అంశాలను ప్రస్తావించాలని MPలకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావాలని, రైతు సమస్యల పరిష్కారం ముఖ్యమని CBN వివరించారు.
News November 28, 2025
అక్కడ మూడో తరగతి వరకు నో ఎగ్జామ్స్

జపాన్లోని విద్యా వ్యవస్థ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అక్కడ మూడో తరగతి వరకూ హోమ్వర్క్స్, ఎగ్జామ్స్, ర్యాంకులంటూ ఉండవు. నాలుగో తరగతి నుంచి అకడమిక్ వర్క్ మొదలవుతుంది. అక్కడ తొలి మూడేళ్లు వారికి బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, క్లాస్ రూమ్ను క్లీన్గా ఉంచుకోవడం, ఇతరులకు హెల్ప్ చేయడం వంటివి నేర్పుతారు. అదే ఇండియాలో నర్సరీ నుంచే పిల్లలు హోంవర్క్, పరీక్షలు, ర్యాంకుల ఒత్తిడిని ఎదుర్కొంటారు.
News November 28, 2025
నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫూలే మరణం(ఫొటోలో)
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం


