News April 19, 2024
అక్కడ 6 జిల్లాల్లో జీరో ఓటింగ్.. కారణం ఇదే

నాగాలాండ్‌లో ఒకే ఒక్క లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. కానీ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలో 6 జిల్లాల్లో జీరో ఓటింగ్ నమోదైంది. నాగాలాండ్ నుండి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ENPO) ఈ ఆరు జిల్లాల ప్రజలను ఓటింగ్‌కి దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. దీంతో 4 లక్షల ఓటర్లున్న ఈ జిల్లాల్లో ఏ ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
Similar News
News December 22, 2025
Study Curse: మూడేళ్ల కోర్స్ vs మూణ్నెళ్ల కోర్స్

మన క్వాలిఫికేషన్ ఏదైనా అమీర్‌పేటలో 3 నెలలు కోచింగ్‌తో ఆర్నెళ్లలో IT జాబ్ పక్కా. మనం మాట్లాడుకునేది అమీర్‌పేట లేదా కోచింగ్ సెంటర్ల ఘనతపై కాదు. అలా జాబ్ ఇచ్చే కోర్సులు కాలేజ్ సబ్జెక్టులుగా ఎందుకుండవు అనే. బేసిక్స్ చెప్పే స్కూల్, ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ చదివితే జాబ్ వస్తుందా అంటే నో గ్యారంటీ. ట్రెండ్, మార్కెట్ అవసరాలకు తగ్గట్లు అప్డేట్ కాని చదువు మనకు అంటగట్టడం ఎందుకు? ఏమంటారు ఫ్రెండ్స్?
News December 22, 2025
USలో విద్యార్థినులకు పెరిగిన ‘డీప్‌ఫేక్’ బెడద

USలో స్కూళ్లలో డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోలతో వేధింపులు ఎక్కువయ్యాయి. విద్యార్థినుల ఫొటోలను అసభ్యంగా మార్చడం ఎంతోకాలంగా జరుగుతున్నా AI సాంకేతికతతో అది మరింత పెరిగింది. లూసియానా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. ఓ టీచర్‌పైనా అభియోగాలు వచ్చాయి. పిల్లల అసభ్య చిత్రాల కేసుల సంఖ్య 2023లో 4,700 కాగా 2025 మొదటి 6 నెలల్లోనే 440,000కి పెరిగినట్లు NCMEC నివేదిక పేర్కొంది.
News December 22, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


