News August 28, 2025

ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకూడదు: సీఎం రేవంత్

image

TG: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ‘వాగులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలి. ఫొటో, వీడియో క్యాప్చర్ ద్వారా పంట నష్టం అంచనా వేయాలి. సమగ్ర వివరాలను భద్రపరచాలి. వర్షపాతం వివరాలు కూడా ప్రజలకు తెలియజేయాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు.

Similar News

News August 29, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లోనూ పాఠశాలలకు హాలిడే ఇవ్వాలనే వినతులు వినిపిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని IMD సూచించింది.

News August 29, 2025

నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్

image

ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ విశాఖపట్నం వేదికగా నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్, రెండో మ్యాచులో బెంగళూరు బుల్స్‌తో పుణెరి పల్టాన్ పోటీ పడతాయి. మొత్తం 12 జట్లు లీగ్ దశలో 108 మ్యాచులు ఆడతాయి. జైపూర్, చెన్నై, ఢిల్లీలోనూ మ్యాచులు జరగనున్నాయి. ఇంకా ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు కాలేదు. మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ 1/తెలుగు, జియో హాట్ స్టార్‌లో చూడవచ్చు.

News August 29, 2025

ఇండస్ట్రీకి ఓ సూపర్ హిట్ కావాలి

image

జనవరిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఈ ఏడాది టాలీవుడ్‌లో రాలేదు. ‘కోర్టు’ చిన్న సినిమాల్లో సూపర్ హిట్‌గా నిలిచింది. కుబేర, తండేల్, మ్యాడ్ స్క్వేర్, హిట్-3 వంటి చిత్రాలు పర్వాలేదనిపించినా బాక్సాఫీసును షేక్ చేయలేకపోయాయి. దీంతో వచ్చే నెలలో రానున్న ‘OG’పైనే ఆశలు నెలకొన్నాయి. సినిమా‌కు పాజిటివ్ టాక్ పడితే కాసుల వర్షం కురవనుంది. తేజా ‘మిరాయ్’ కూడా ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది.