News June 27, 2024
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండొద్దు: మంత్రి రాజనర్సింహ

TG: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని DMHOలను ఆదేశించారు. ప్రతి 30KM పరిధిలో PHC ఉండాలన్నారు. జిల్లా, ఏరియా, PHCల అనుసంధానంపై దృష్టిసారించాలని సూచించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News November 5, 2025
అమరావతికి సలహాలు ఇవ్వండి

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి CRDA విజన్-2047 రూపొందిస్తోంది. ఇందులో భాగంగా అర్బన్ డిజైన్స్, ఆర్కిటెక్చరల్ గైడ్లెన్స్ కోసం సలహాలు, అభ్యంతరాలను తెలపాలని ప్రజలు, సంస్థలను కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు <
News November 5, 2025
పెరటి కోళ్ల పెంపకానికి అనువైన రకాలివే..

పెరటి కోళ్ల పెంపకం నేడు ఉపాధి మార్గంగా మారుతోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నాటుకోళ్ల కంటే పెరటి కోళ్ల పెంపకంతోనే అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. వనరాజ, గ్రామప్రియ, గ్రామలక్ష్మి, వనశ్రీ, రాజశ్రీ, గాగస్, కడక్‌నాథ్, ఆసిల్ పెంపకానికి అనువైన పెరటి కోళ్ల రకాలు. వీటిలో కొన్ని 6 నెలల్లోనే 2-3 కిలోల బరువు పెరిగి, ఏటా 150-180 గుడ్లు పెడతాయి.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News November 5, 2025
దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

ఎకనామిక్ సర్వే (2024-25) ప్రకారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తలసరి GDPలో దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా నిలిచింది. దీని తలసరి GDP ₹11.46 లక్షలు. ఆ తర్వాత గురుగ్రామ్ (₹9.05 లక్షలు), బెంగళూరు అర్బన్ (₹8.93L), గౌతమ్ బుద్ధ్ నగర్-నోయిడా, సోలాన్ (HP), నార్త్&సౌత్ గోవా, సిక్కిం, దక్షిణ కన్నడ, ముంబై(₹6.57L), అహ్మదాబాద్ ఉన్నాయి. ఐటీ, ఫార్మా కంపెనీలు, మెరుగైన కనెక్టివిటీ వల్ల రంగారెడ్డి టాప్‌లో నిలిచింది.


