News November 30, 2024
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు: CM

AP: రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్‌లైన్‌లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ రికార్డులు, భూకబ్జాలు, అసైన్మెంట్ భూముల సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటికి సత్వర, పూర్తిస్థాయి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Similar News
News April 7, 2026
టికెట్ ధరల్ని పెంచిన ఎయిరిండియా

గ్లోబల్ మార్కెట్‌లో విమాన ఇంధన ధరలు పెరగడంతో ఎయిరిండియా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల ఛార్జీలను పెంచింది. దేశీయంగా దూరాన్ని బట్టి ప్రయాణికులపై ₹299 నుంచి ₹899 వరకు అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ రూట్లలో గరిష్ఠంగా 280 డాలర్ల వరకు ఇంధన సర్‌ఛార్జీని పెంచారు. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం.
News April 7, 2026
పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో.. రాజ్‌నాథ్ వార్నింగ్

భారత్‌తో యుద్ధం వస్తే ఈసారి కోల్‌కతా వరకు వస్తామంటూ పాక్ మంత్రి ఖవాజా పలికిన <<19571096>>ప్రగల్భాలపై<<>> రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలుసన్నారు. ‘ఖవాజా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. 55 ఏళ్ల కిందట ఇలాంటి మాటల వల్లే పాక్ రెండు ముక్కలైన విషయాన్ని మర్చిపోవద్దు’ అని చురకలంటించారు.
News April 7, 2026
అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(1/2)..

తాజాగా <<19586211>>కల్పాక్కం<<>>లో భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సక్సెస్ సాధించింది. ఇది ఇండియాకు పెద్ద విజయం. మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నందున అణు పితామహుడు హోమీ బాబా 3దశల ప్రణాళికను రూపొందించారు. మొదట సహజ సిద్ధమైన U-238తో విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో బై-ప్రొడక్ట్‌గా విలువైన ప్లుటోనియం-239 వెలువడుతుంది. ఇది తదుపరి దశలకు ఇంధనంగా మారుతుంది.


