News November 24, 2024
అక్కడ ఆఫీసర్ల కంటే ఖైదీలకే జీతాలెక్కువ..!
యూకేలోని జైళ్లలో ఖైదీల ఆదాయం అక్కడి అధికారులు, టీచర్ల కంటే ఎక్కువగా ఉంది. ఒక్కో ఖైదీ ఏడాదికి సుమారుగా రూ.39 లక్షలు సంపాదిస్తారు. కొంచెం పని తక్కువ చేసే ఖైదీలు ఏటా రూ.24 లక్షలు గడిస్తారు. ఇది అక్కడి జైలు గార్డు జీతంతో దాదాపుగా సమానం. గార్డులకు రూ.29 లక్షల వరకు జీతమిస్తారు. కాగా అక్కడి ఖైదీలు జైల్లో నుంచి బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. లారీ, బస్సు డ్రైవర్లుగా కూడా వారు పనిచేస్తున్నారు.
Similar News
News November 24, 2024
రూ.12.50 కోట్లు పలికిన జోఫ్రా ఆర్చర్
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేలంలో భారీ ధర పలికారు. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన అతడిని రూ.12.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఇతడి కోసం ముంబై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. గతంలో ఇతడు RR, MI జట్ల తరఫున ఆడారు. కానీ గాయాల బెడదతో మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయారు.
News November 24, 2024
ప్రసిద్ధ్ కృష్ణకు రూ.9.5 కోట్లు, అవేశ్ ఖాన్‌కు రూ.9.75 కోట్లు
భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను GT కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌కు వచ్చిన అతడిని గుజరాత్ టైటాన్స్ రూ.9.50 కోట్లకు దక్కించుకుంది. మరో బౌలర్ అవేశ్ ఖాన్‌ను రూ.9.75 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.
News November 24, 2024
రూ.12.50 కోట్లకు హేజిల్‌వుడ్‌ను సొంతం చేసుకున్న ఆర్సీబీ
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ హేజిల్‌వుడ్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.2కోట్లతో వేలానికి వచ్చిన అతడిని రూ.12.50 కోట్లకు RCB దక్కించుకుంది. ఇతడి కోసం ముంబై, ఆర్సీబీ పోటీ పడ్డాయి. హేజిల్‌వుడ్ IPLలో 27 మ్యాచులు ఆడి 35 వికెట్లు తీసుకున్నారు.