News June 15, 2024
రైలులో అగ్ని ప్రమాదమంటూ వదంతి.. కిందకు దూకడంతో ముగ్గురు మృతి

ఝార్ఖండ్లో ముగ్గురు రైలు ప్రయాణికులు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ససారం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం చెలరేగిందంటూ కొందరు వదంతి రేపారు. ప్రాణభయంతో పలువురు కిందకు దూకేశారు. అదే సమయంలో పక్కనున్న పట్టాలపై గూడ్సు రైలు రావడంతో దాని కింద నలిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆ ప్రాంతంలో మావో ప్రాబల్యం ఉండటంతో వదంతి వెనుక ఉగ్రవాద కోణంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
Similar News
News November 15, 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. సత్య నాదెళ్లకు ఆహ్వానం?

డిసెంబర్ 8, 9న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లను ఆహ్వానించాలని ప్రయత్నిస్తోంది. వచ్చేనెల నాదెళ్ల INDలో పర్యటించనున్నట్లు సమాచారం. దీంతో ఆయన టూర్ షెడ్యూల్పై అధికారులు ఆరా తీస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే నాదెళ్ల రాకపై క్లారిటీ రానుంది.
News November 15, 2025
దివ్యాంగుల రిజర్వుడ్ పోస్టుల భర్తీ గడువు పొడిగింపు

AP: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని దివ్యాంగుల రిజర్వుడ్ ఖాళీలను ప్రత్యేక రిక్రూట్మెంటు ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయించిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ బ్యాక్లాగ్ కేటగిరీ పోస్టులను 2026 మార్చి 31లోగా భర్తీ చేయాలని సూచించింది. ఈమేరకు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో 2024 మార్చి 31లోగా పోస్టుల భర్తీకి గడువు నిర్దేశించగా తాజాగా దాన్ని పొడిగించింది.
News November 15, 2025
ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి చేశారు: చాందిని చౌదరి

కెరీర్ ప్రారంభంలో ఓ మూవీలో ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి తెచ్చారని హీరోయిన్ చాందిని చౌదరి అన్నారు. ‘కథ చెప్పినప్పుడు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. ఆ సమయంలో అర్జున్రెడ్డి సినిమా విడుదలై హిట్ అయింది. దీంతో మా సినిమాలోనూ కిస్ సీన్లు పెడితే హిట్ అవుతుందని అనుకున్నారు. దర్శకుడు చెప్పినట్టు చేయకపోతే చెడ్డపేరు వస్తుంది. అయితే, హీరో చేయనని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నాను’ అని చెప్పారు.


