News December 18, 2024
ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరగలేదు: KTR

TG: CM రేవంత్‌కు KTR బహిరంగ లేఖ రాశారు. ‘ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి. అప్పుడే నిజాలేమిటో తేలుతాయి. HYDకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఫార్ములా-ఈ రేసు సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. కానీ మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. BRSపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి చేకూరింది’ అని వెల్లడించారు.
Similar News
News December 2, 2025
సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

సౌత్ సెంట్రల్ రైల్వే(<
News December 2, 2025
పిల్లల్ని కనండి.. ఎలాన్ మస్క్ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటుపై వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే మానవ జాతి క్షీణించి.. అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. జెరోధా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ <<18433631>>People by WTF<<>> పాడ్‌కాస్ట్‌లో మస్క్ కీలక విషయాలు పంచుకున్నారు. “నువ్వూ పిల్లలను కనాల్సిందే” అంటూ కామత్‌కు సూచించారు. మనిషి మనుగడ కోసం సంతానం కొనసాగించాలని స్పష్టం చేశారు.
News December 2, 2025
నడకతో అల్జీమర్స్‌ను నివారించొచ్చు: వైద్యులు

అల్జీమర్స్‌ను నడకతో నివారించవచ్చని కొత్త అధ్యయనంలో తేలిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజుకు 3,000–5,000 అడుగులు నడిస్తే మెదడులో అల్జీమర్స్ కారక ప్రోటీన్ల నిర్మాణం నెమ్మదిస్తుందని తేలింది. అల్జీమర్స్‌కు చికిత్స లేనప్పటికీ, నివారణ సాధ్యమని చెబుతున్నారు. నడక అనేది అత్యంత శక్తిమంతమైన నివారణ మార్గమని, నడక మొదలుపెట్టాలని సూచించారు.


