News March 22, 2025

ఆ జట్లు తలపడితే భారీ క్రేజ్: హర్భజన్ సింగ్

image

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్-పాక్ మ్యాచులకు ఏవిధంగా క్రేజ్ ఉంటుందో, ఐపీఎల్ ఈవెంట్ లో చెన్నై-ముంబయి మ్యాచులకు అలాంటి క్రేజ్ ఉంటుందని హర్భజన్ సింగ్ అన్నారు. రెండు జట్లలో టాప్ ప్లేయర్స్ ఉన్నారని, మంచి ఫ్యాన్ బేస్ ఉందని తెలిపారు. ధోనీ ఆటకోసం CSK ఫ్యాన్స్ ఏడాదిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పటి యువ క్రికెటర్లలో రియాన్ పరాగ్ గేమ్ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. రేపు చెన్నైలో MI-CSK తలపడనున్నాయి.

Similar News

News October 15, 2025

ప్రముఖ నటుడు కన్నుమూత

image

వెటరన్ బాలీవుడ్ యాక్టర్ పంకజ్ ధీర్(68) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచినట్లు సినీ& TV ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 1988-94 మధ్య BR చోప్రా తెరకెక్కించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్రతో పంకజ్ గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు.

News October 15, 2025

బిహార్‌లో 57 మందితో JDU తొలిజాబితా

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు పాలక జనతాదళ్(U) 57 మందితో తొలిజాబితా విడుదల చేసింది. నిన్న NDA కూటమిలోని బీజేపీ 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. 2 విడతల్లో జరిగే ఎన్నికల్లో BJP, JDU చెరో 101 సీట్లలో, LJP (R)29, RLM, HAM 6 చొప్పున సీట్లలో పోటీచేయాలని నిర్ణయించాయి. అయితే తమకు సంబంధించిన కొన్ని స్థానాలను LJPకి కేటాయించడంపై JDU అభ్యంతరం చెబుతోంది. ఆ స్థానాల్లో తమ వారికి టిక్కెట్లు ఇచ్చింది.

News October 15, 2025

పత్తి దిగుబడి పెరగాలంటే..

image

ప్రస్తుతం పత్తి పంట పూత, కాయ తయారీ దశలో ఉంది. మూడు నెలలు పై బడిన పంటకు యూరియా, పొటాష్, కాంప్లెక్స్ వంటి ఎరువులను పైపాటుగా వేయరాదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ‘పంటపై 10గ్రా. 13:0:45(మల్టీ-కే) లేదా 19:19:19(పాలిఫీడ్) లీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలి. లేదా 20గ్రా. యూరియాను 10-15రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే కాయ ఎదుగుదల బాగుంటుంది. అధిక దిగుబడి సాధ్యమవుతుంది’ అని పేర్కొంటున్నారు.