News March 14, 2025
సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు: CM

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.
Similar News
News December 1, 2025
అంకన్నగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం..!

ములుగు మండలంలోని ఆదర్శ గ్రామ పంచాయతీ అంకన్నగూడెం పాలకవర్గం ఏకగ్రీవమైంది. ఈ గ్రామానికి రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కేటాయించగా.. సర్పంచ్‌గా కొట్టెం రాజు, ఉప సర్పంచ్‌గా అల్లెం నాగయ్యను ఎన్నుకుంటూ గ్రామస్థులు తీర్మానించారు. ఆరుగురు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. <<18420628>>1972లో పంచాయతీ ఆవిర్భావం నుంచి ఏకగ్రీవం <<>>చేసుకుంటున్న గ్రామస్థులు అదే ఆనవాయితీని కొనసాగించారు. మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారు.
News December 1, 2025
పెళ్లి చేసుకున్న సమంత!

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వెల్లడించాయి. ఈ కపుల్‌కు పలువురు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించి ఈ జోడీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News December 1, 2025
యువతకు ‘గీత’ చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే!

నేటి యువతరం భగవద్గీత నుంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి, ఫలితంపై ఆందోళన చెందకుండా తమ పనిని నిస్వార్థంగా చేయాలని గీత బోధిస్తుంది. మంచి జరిగినా, చెడు జరిగినా రెండింటినీ జీవితంలో భాగమే అనుకొని, ఏకాగ్రతతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఆత్మవిశ్వాసం, నిలకడ నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకం. SHARE IT


