News February 6, 2025
కరెంట్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం
AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News February 6, 2025
మంత్రులకు CM చంద్రబాబు ర్యాంకులు.. పవన్ కళ్యాణ్‌కు ఎంతంటే?
గతేడాది DEC వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం ర్యాంకులు కేటాయించారు. చంద్రబాబు 6, లోకేశ్ 8, పవన్ 10వ స్థానంలో ఉన్నారు.
ర్యాంకులు: ఫరూక్, దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల, DBV స్వామి, సత్యకుమార్, జనార్దన్ రెడ్డి, పవన్, సవిత, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి, నారాయణ, భరత్, ఆనం, అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి, అనిత, సత్యప్రసాద్, నిమ్మల, పార్థసారథి, పయ్యావుల, వాసంశెట్టి
News February 6, 2025
జొమాటో పేరు మారింది..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పేరు మార్చుకుంది. ఇక నుంచి ‘జొమాటో లిమిటెడ్’కు బదులు ‘Eternal Limited’ పేరు కొనసాగుతుందని ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని, షేర్ హోల్డర్లు ఈ పేరును ఆమోదించాల్సి ఉందని పేర్కొంది.
News February 6, 2025
INDvsENG మ్యాచులో ‘పుష్ప’
నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియం వేదికగా జరుగుతోన్న INDvsENG తొలి వన్డే మ్యాచ్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇందులో ఓ వ్యక్తి ‘పుష్ప-2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ గంగమ్మ జాతర సాంగ్‌లో వేసిన గెటప్‌తో దర్శనమిచ్చాడు. పుష్ప ఫీవర్ నాగ్‌పూర్‌ను తాకిందంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, అతనికి ఈ గెటప్ సూట్ కాలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అతడెలా ఉన్నాడో కామెంట్ చేయండి.