News April 16, 2025
ఇక టోల్ గేట్లు ఉండవు: మంత్రి

జాతీయ రహదారులపై ఉండే టోల్గేట్స్ త్వరలోనే కనుమరుగవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాలు నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్ ఛార్జ్ కట్ అయ్యేలా కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆ నూతన పాలసీ అమలుపై 15రోజుల్లో ప్రకటన వస్తుందని మంత్రి పేర్కొన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనదారుల రద్దీ దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
Similar News
News November 25, 2025
ఒకేసారి వడ్డీ లేని రుణాల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి వడ్డీ లేని రుణాల పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. రాష్ట్రంలో 3.50 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ₹304 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
News November 25, 2025
సుబ్రహ్మణ్య స్వామిని పూజించే విధానం ఇదే..

సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయాన్నే తల స్నానం చేయాలి. తడి బట్టలతో కార్తికేయుడి ఆలయానికి వెళ్లి పూజ చేయాలి. మురుగన్కు పండ్లు, పువ్వులు సమర్పించడం శ్రేయస్కరం. బ్రహ్మచారిగా ఉన్న స్కందుడిని పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్మకం. పండుగ నాడు బ్రహ్మచారులకు భోజనం పెట్టి, వస్త్రాలు సమర్పించి గౌరవిస్తారు. కావడి మెుక్కులు తీర్చుకునే ఆచారం కూడా ఉంది. ఫలితంగా పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.
News November 25, 2025
చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. వయా తిరుపతి

APలోని తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపేలా ద.మ. రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసి తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. చెన్నై నుంచి HYD వరకు 778km ప్రాజెక్టులో తొలుత గూడూరు మీదుగా రైలు నడపాలని ద.మ. రైల్వే భావించింది. తిరుపతి నుంచి అమలు చేయాలన్న TN విజ్ఞప్తితో కొన్ని సవరణలు చేసింది. దీనికి ఆ ప్రభుత్వం అంగీకరిస్తే చెన్నై-తిరుపతి-HYD బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.


