News July 24, 2024
సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు: కిషన్ రెడ్డి

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై సమాధానమిచ్చిన కిషన్ రెడ్డి.. దేశంలో ఏ బొగ్గు గనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలంటే 51% వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకమని తెలిపారు. సింగరేణికి కేంద్రం మద్దతు ఉంటుందన్నారు.
Similar News
News March 29, 2026
‘అగ్ర తాంబూలం’ ఇవ్వడం అంటే?

ఏవైనా కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో ఓ వ్యక్తికి లేదా వర్గాలకు అధిక ప్రాధాన్యం, గౌరవం ఇస్తున్నారని చెప్పే సందర్భంలో ‘అగ్ర తాంబూలం’ జాతీయాన్ని వాడతారు. మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేశారు. చివరలో శ్రీకృష్ణుడికి మొదటి తాంబూలం ఇచ్చి గౌరవించారు. ఆ ఘట్టం నుంచే అగ్ర తాంబూలం వాడుకలోకి వచ్చిందని భాషా నిపుణులు చెబుతుంటారు. ప్రతి వేడుకలోనూ ఆకువక్కలతో తాంబూలం ఇవ్వడం అందరికీ తెలిసిందే.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 29, 2026
KCR అందుకే అసెంబ్లీకి రావడం లేదు: రేవంత్

TG: BRS అధినేత KCR దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే ఎస్సీని స్పీకర్ చేసినట్లు CM రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు రావట్లేదని ధ్వజమెత్తారు. దొర బిడ్డనై ఉండి దళితుడి ముందు కింద కూర్చోవాలా? అనే అహంకారంతోనే రావట్లేదని ఆరోపించారు. అహంకారమో, వయసు మీద పడిందని ఆయన్ను కొన్ని విషయాల్లో వదిలేసినా సభకు వచ్చిన BRS నేతల తీరు సరిగా లేదని CM మండిపడ్డారు.
News March 29, 2026
రూ.12,000 కోట్ల ఆస్తి.. చివరికి

‘రేమండ్’తో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన <<19504124>>విజయ్‌పత్ సింఘానియా<<>> జీవిత చరమాంకంలో అద్దె ఇంట్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2015లో ₹12K కోట్ల కంపెనీతోపాటు తన 37% వాటా(₹1,000 కోట్లు)ను కొడుకు గౌతమ్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆయన తండ్రిని పట్టించుకోవడం మానేశారు. ఆఖరికి ఇల్లు కూడా ఇవ్వకపోవడంతో విజయ్ కోర్టుకెక్కారు. కొడుకును నమ్మి ఆస్తులు అప్పగించడం అతిపెద్ద తప్పు అని సింఘానియా గతంలో చెప్పారు.


