News January 17, 2025
ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదు: కుమారస్వామి

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తేవడమే కేంద్రం లక్ష్యమని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. రానున్న రెండు, మూడేళ్లలో ప్లాంట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా చేస్తామన్నారు. ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదని స్పష్టం చేశారు. ఇవాళ ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ మొదటిదేనని, భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సాయాల ప్రకటనలు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 18, 2025
‘బ్రహ్మపుత్ర’పై చైనా డ్యామ్.. భారత్‌కు ముప్పు!

యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై $168B (సుమారు రూ.1,51,860CR)తో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నది కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది. సుమారు 2KM ఎత్తును ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల నది సహజ ప్రవాహం మారే ప్రమాదం ఉంది. దీంతో వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశముంది. అలాగే భవిష్యత్తులో నీటిని ఆయుధంగానూ ఉపయోగించే ప్రమాదముంది.
News December 18, 2025
ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 18, 2025
గర్భంతో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

గర్భధారణ సమయంలో ఒకే పొజిషన్‌లో ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. బరువైన వస్తువులను ఎత్తడం, అధిక పని చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం, ధూమపానం చేయకూడదు. కెఫీన్ తగ్గించాలి. పచ్చి ఆహారాలను తినకూడదని సూచిస్తున్నారు. సమయానికి తగ్గట్లు స్కానింగ్‌లు చేయించుకోవాలి.


