News January 6, 2025
నిప్పు లేనిదే పొగ రాదు: ఏబీ డివిలియర్స్
భారత డ్రెస్సింగ్ రూమ్లో ఏదో జరుగుతోందని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అనుమానం వ్యక్తం చేశారు. నిప్పు లేనిదే పొగ రాదని ఆయన చెప్పారు. ‘విదేశాల్లో ఆడేటప్పుడు ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. కుటుంబాన్ని వదిలేసి వారాల తరబడి ఉండటం వారిని కుంగదీస్తుంది. BGTలో వరుస ఓటములు భారత ఆటగాళ్లలో విభేదాలు సృష్టించి ఉండొచ్చు. క్రికెటర్లు అత్యుత్తమ ఆట ఆడనప్పుడు ఇలాంటి రూమర్లు వస్తాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News January 7, 2025
విరాట్ కోహ్లీపై రోహిత్ కోచ్ పరోక్ష విమర్శలు
ఆస్ట్రేలియాతో సిరీస్లో ఫామ్ లేమి కారణంగా ఆఖరి మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ స్వచ్ఛందంగా జట్టు నుంచి తప్పుకొన్నారు. అయితే ఫామ్లో లేనిది రోహిత్ ఒక్కరే కాదు కదా అంటూ ఆయన చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ కోహ్లీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ పూర్తిగా రిటైరై ఉండేవారు. భారత్కు టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్కప్ అందివ్వడం ఆయన కల. అందుకే కొనసాగుతున్నారు’ అని స్పష్టం చేశారు.
News January 7, 2025
సంక్రాంతి బస్సుల్లో 10% రాయితీ: APSRTC
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 7200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు APSRTC ప్రకటించింది. రేపటి నుంచి 13 వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2,153 బస్సులు, బెంగళూరు నుంచి 375 బస్సులు, తిరుగు ప్రయాణాల కోసం 3200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని పేర్కొంది. రానూపోనూ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10శాతం రాయితీగా ఇస్తామని వెల్లడించింది.
News January 7, 2025
గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతల యత్నం
TG: హైదరాబాద్లోని నాంపల్లిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతల దాడిని నిరసిస్తూ బీజేపీ నేతలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా వారు రోడ్డుపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.