News February 28, 2025
కారు ఇన్సూరెన్స్‌లో ఈ 4 యాడ్ ఆన్స్ తప్పనిసరి!

* జీరో డిప్రెసియేషన్: దీనివల్ల ఫుల్ క్లెయిమ్ అందుతుంది.
* ఇంజిన్ ప్రొటెక్షన్: ఇది యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల ఇంజిన్ రిపైర్, రీప్లేస్‌మెంట్ సదుపాయం ఉంటుంది.
* రోడ్ సైడ్ అసిస్టెంట్: ప్రయాణంలో మీ కారు బ్రేక్ డౌన్ అయితే టోయింగ్, ఫ్యూయల్ అందించడం, బ్యాటరీ తదితర రిపైర్స్ చేస్తారు.
* కంన్జ్యూమబుల్ కవరేజీ: రిపేర్ సమయంలో ఇంజిన్ ఆయిల్, నట్లు, బోల్టులు, బ్రేక్ ఆయిల్ వంటి వాటికీ రీయింబర్స్‌మెంట్.
Similar News
News February 9, 2026
పిల్లల్లో ఆకలి ఎందుకు తగ్గుతుందంటే?

పిల్లల్లో వయసుకు తగిన ఎదుగుదల లేకపోవడం, పాలు ఎక్కువగా తాగడం, చిరుతిళ్లు తినడం, నులిపురుగులు, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఆకలి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం, పండ్లు, సూప్స్ పెట్టాలి. జంక్ ఫుడ్ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే ఊబకాయం, అనారోగ్యాలు వస్తాయి. ఫోన్లు, టీవీ చూపించి అన్నం పెట్టొద్దు. దీనితో అర్టిజం, హైపర్ యాక్టివ్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
News February 9, 2026
ఎండిన మామిడి ఆకులు తోరణాలుగా ఉండకూడదా?

ఎండిన మామిడి ఆకులు గుమ్మానికి ఉండటం అశుభంగా భావిస్తారు. అవి నల్లగా మారినా వెంటనే తొలగించాలి. లేకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని నమ్ముతారు. ఇంట్లో ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంటుందట. అందుకే ఎండిన తోరణాలను తొలగించి అవసరమైతే మూలా నక్షత్రం రోజున, ఇతర శుభ ముహూర్తాల్లో కొత్త పచ్చని మామిడి ఆకులను కట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఇంటికి సానుకూల శక్తి చేకూరి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
News February 9, 2026
APPLY NOW: నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో ఉద్యోగాలు

తిరువనంతపురంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (NCESS)లో 3 జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncess.gov.in


