News December 18, 2024
ఔరా అనిపించే అశ్విన్ కెరీర్ స్టాట్స్ ఇవే..

టీమ్ఇండియా స్పిన్ లెజెండ్ <<14911911>>అశ్విన్<<>> టెస్టు, వన్డే, టీ20లు కలిపి మొత్తం 287 INTL మ్యాచులు ఆడారు. 5833 ఓవర్లు విసిరారు. అందులో 947 మెయిడిన్లు ఉన్నాయి. 25.80 AVG, 3.38 ECO, 45.7 SRతో 765 వికెట్లు పడగొట్టారు. 8 సార్లు 10, 37సార్లు 5 వికెట్ల ఘనత అందుకున్నారు. 6 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీల సాయంతో 4394 రన్స్ చేశారు. SR 59.41. టెస్టుల్లో 106 మ్యాచుల్లో 537, 116 వన్డేల్లో 156, 65టీ20ల్లో 72 వికెట్లు తీశారు.
Similar News
News November 24, 2025
బీజేపీతో పొత్తు.. కొట్టిపారేసిన ఒవైసీ

‘బీజేపీతో మజ్లిస్ పొత్తు’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా వర్గాలు వక్రీకరించి తప్పుదోవ పట్టించాయన్నారు. ‘ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. బీజేపీ భాగస్వామ్యం ఉన్న ఏ సర్కారుకూ మద్దతివ్వం. అయితే సీమాంచల్(బిహార్)అభివృద్ధికి నితీశ్ ప్రభుత్వం కృషి చేస్తే సహకరిస్తాం’ అని స్పష్టం చేశారు. తమ పోరాటం ప్రజల హక్కుల కోసమేనని తేల్చి చెప్పారు.
News November 24, 2025
గులాబీలో చీడలను ఎలా నివారించవచ్చు?

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.
News November 24, 2025
హైకమాండ్ కోరుకుంటే సీఎంగా కొనసాగుతా: సిద్దరామయ్య

కాంగ్రెస్ హైకమాండ్ కోరుకుంటే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. మార్పులు ఏవైనా కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని చెప్పారు. వారు ఏం చెప్పినా తాను, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అంగీకరించాల్సిందేనని తెలిపారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు 4-5 నెలల కిందటే హైకమాండ్ ఒప్పుకుందని, అయితే 2.5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యేదాకా ఆగాలని చెప్పిందని పేర్కొన్నారు.


