News January 11, 2025
మళ్లీ జన్ముంటుందని నమ్మే దేశాలివే!
చాలా ప్రాంతాల్లో మరణం తర్వాత మళ్లీ పుడతామని విశ్వసిస్తుంటారు. అలాంటి వారు అధికంగా ఉన్న దేశం బంగ్లాదేశ్. అక్కడ మొత్తం జనాభాలోని 98.8 శాతం మంది మరోసారి జన్మ ఉంటుందని నమ్ముతున్నట్లు వరల్డ్ వాల్యూస్ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత మొరాకో (96.2%), లిబియా (95.2%), టర్కీ(91.8%), ఇరాన్(91.3%), పాకిస్థాన్ (89.3%), ఈజిప్ట్ (88.1%), ఫిలిప్పీన్స్(83.8%), నైజీరియా (83.1%) ఉన్నాయి.
Similar News
News February 5, 2025
దానం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ!
TG: అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 5, 2025
అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు
TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.
News February 5, 2025
రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ
TG: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.