News August 25, 2025

వీళ్లు భర్తలు కాదు.. నరరూప రాక్షసులు

image

TGలో పలువురు భర్తల వరుస దురాగతాలు ఉలిక్కిపడేలా చేశాయి. HYDలో అనుమానంతో 4 నెలల గర్భవతైన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి చంపి, ముక్కలు చేసి మూసీలో పడేశాడు. అదే అనుమానంతో నాగర్‌కర్నూల్(D) పెద్దకొత్తపల్లిలో భార్య శ్రావణిని భర్త శ్రీశైలం హత్య చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కొత్తగూడెంలో లక్ష్మీప్రసన్నను రెండేళ్లుగా కడుపు మాడ్చి చంపేయగా, వరంగల్‌లో భార్య గౌతమిని భర్త ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

Similar News

News August 25, 2025

CM రేవంత్‌కు రక్షణగా బీజేపీ ఎంపీలు: KTR

image

TG: BJP MPలు CM రేవంత్‌కు రక్షణగా ఉంటున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ‘6 గ్యారంటీలపై BJP MPలు ఎప్పుడైనా రేవంత్‌ను ప్రశ్నించడం చూశారా? KCRపై మాత్రం మాట్లాడతారు. బడే భాయ్ (మోదీ), చోటా భాయ్ (రేవంత్) కలిసి పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆటలో అరటిపండు లాంటివాడు. ఆయనకు ఎప్పుడో దెబ్బ పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. గత 11 ఏళ్లలో TGకి BJP ఎలాంటి సాయం చేయలేదని, గాయాలు చేసిందని విమర్శించారు.

News August 25, 2025

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పలువురు మంత్రులు ఉన్నారు. ఈ సాయంత్రం న్యాయ నిపుణులతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం చర్చించే అవకాశం ఉంది. రేపు ఉదయం బిహార్‌లో జరుగుతున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొననున్నారు.

News August 25, 2025

సత్తా చాటిన విద్యార్థులకు సీఎం అభినందనలు

image

AP: రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ బడుల్లో చదివి ఈ ఏడాది IIT, నిట్, నీట్‌లో సీట్లు సాధించిన విద్యార్థులను CM చంద్రబాబు అభినందించారు. సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఇవాళ సచివాలయంలో సీఎంను కలిశారు. పేదరికం నుంచి వచ్చి ఉత్తమ ప్రతిభ చూపిన వారికి సీఎం ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులకు మెమెంటోలు, ఒక్కో విద్యార్థికి రూ.లక్ష చొప్పున చెక్ అందించి వారితో విడివిడిగా ఫొటోలు దిగారు.