News October 15, 2024
ఇవే మా డిజిటల్ పిల్లర్లు: ప్రధాని మోదీ

తక్కువ డివైజ్ కాస్ట్, డిజిటల్ కనెక్టివిటీ, డేటా వినియోగ వసతి, డిజిటల్ ఫస్ట్ తమ Digital India నాలుగు స్తంభాలని PM మోదీ పేర్కొన్నారు. World Telecommunication Standardization Assembly-2024 సదస్సును ఆయన ప్రారంభించారు. 120 కోట్ల మొబైల్ ఫోన్ల యూజర్లలో 95 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని పేర్కొన్నారు. టెలికాం, టెలికాం సంబంధిత సాంకేతిక వృద్ధిలో భారత్ వేగంగా ముందుకెళ్తోందని మోదీ అన్నారు.
Similar News
News November 14, 2025
WTC ఫైనల్లో టాస్ గెలుస్తాం: గిల్

టెస్టుల్లో మరోసారి టాస్ ఓడిపోవడంపై టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫన్నీగా స్పందించారు. SAతో తొలి టెస్టులో టాస్ ఓడిన అనంతరం ‘నేను టాస్ గెలవబోయే ఏకైక మ్యాచ్ WTC ఫైనలే కావొచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆయన 8 టెస్టులకు కెప్టెన్సీ చేయగా, 7 మ్యాచుల్లో టాస్ ఓడారు. అటు సౌతాఫ్రికా 2015 తర్వాత భారత్ గడ్డపై టెస్టుల్లో తొలిసారి టాస్ గెలిచింది. ప్రస్తుతం SA ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 66/2గా ఉంది.
News November 14, 2025
ఇక బెంగాల్ వంతు: కేంద్ర మంత్రి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, ఇక తర్వాతి లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బిహార్ నిర్ణయించుకుంది. ఇక్కడి యువత తెలివైనది. ఇది అభివృద్ధి సాధించిన విజయం. బెంగాల్లో అరాచక ప్రభుత్వం ఉంది. అక్కడా మేం గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
News November 14, 2025
4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.


