News January 22, 2025
రిలేషన్కు బ్రేకప్ చెబుతారనే సంకేతాలు ఇవి..
సైకాలజిస్టుల ప్రకారం మీతో రిలేషన్ను మీ పార్ట్నర్ ముగించాలని డిసైడ్ అయితే ఇలా తెలుస్తుంది
– ఒకప్పటిలా మీతో సన్నిహితంగా ఉండకపోవడం/ సరిగా స్పందించకపోవడం/ కారణాలు ఎక్కువ చెప్పడం/ గొడవలు పెరగడం/కేరింగ్ & షేరింగ్ తగ్గడం
– తనతో ఫ్యూచర్ గురించి చెబితే అనాసక్తి చూపడం
– క్లోజ్ రిలేషన్ కాకుండా ఫార్మల్గా ఉండటం
– మరొకరితో పోల్చడం, ఇతరుల గురించి మాట్లాడటం
– ప్రతి విషయాన్ని గుచ్చి చూడటం, లెక్కగట్టడం
Similar News
News January 22, 2025
BJPకి కటీఫ్ చెప్పిన నితీశ్.. ట్విస్ట్ ఏంటంటే!
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీజేపీకి షాకిచ్చారు. మణిపుర్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. అక్కడ ఆ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే 5 స్థానాలున్న NPP సైతం మద్దతు వెనక్కి తీసుకుంది. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో ప్రస్తుతం NDA బలం 45కు తగ్గింది. ఇక్కడ బీజేపీకి సొంతంగా 37 సీట్లు ఉన్నాయి. అధికారానికి 31 చాలు.
News January 22, 2025
నోటిఫికేషన్ వచ్చేసింది..
UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <
News January 22, 2025
అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11వేల కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం పొందేందుకు చర్చలు జరిపామన్నారు. దీంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని నారాయణ పేర్కొన్నారు.