News June 10, 2024

పార్లమెంట్ సభ్యుడు పొందే బెన్ఫిట్స్ ఇవే!

image

– బేస్ పే & ఆఫీస్ అలవెన్స్ కలిపి నెలకు రూ.1.60 లక్షలు
– ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.1.5 లక్షలు
– ఏడాదికి 34 ఫ్రీ ఫ్లైట్ టికెట్స్
– అపరిమిత 1st AC ట్రైన్ టికెట్స్
– ఉచిత నివాస గృహం
– ఏడాదికి ఉచితంగా 50వేల యూనిట్ల విద్యుత్ వినియోగం
– పార్లమెంట్ సెషన్స్ సమయంలో DA రూ.2వేలు
– ఉచితంగా CGHS వైద్యం పొందొచ్చు
– మాజీ ఎంపీలకు నెలకు కనీసం రూ.25 వేల పెన్షన్

Similar News

News December 23, 2024

ఈ నెల 30న క్యాబినెట్ భేటీ

image

తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.

News December 23, 2024

శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

image

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను KIMS వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని, తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో వివరించారు.

News December 23, 2024

శ్రీరామ్ టాలెంట్‌ను 2004లోనే గుర్తించిన ZOHO సీఈవో

image

ఇండో అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్‌ను AIపై వైట్‌హౌస్ సీనియర్ సలహాదారుగా <<14956777>>నియమించడంపై<<>> ZOHO CEO శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ‘2004లో శ్రీరామ్ SRM యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు అతనిని రిక్రూట్ చేయాలనుకున్నా. కానీ అప్పటికే మైక్రోసాఫ్ట్ తీసేసుకుంది. తర్వాత సిలికాన్ వ్యాలీకి వెళ్లి వ్యాపారవేత్తగా మారారు. ట్రంప్ తన సాంకేతిక బృందానికి గొప్ప ప్రతిభను యాడ్ చేశారు’ అని Xలో రాసుకొచ్చారు.