News October 22, 2024
పార్లమెంట్ సభ్యులు పొందే ప్రయోజనాలు ఇవే

MPకి నెలకు రూ.1లక్ష జీతం లభిస్తుంది. వీటితో పాటు ఆయనకు మొబైల్ ఛార్జీల కింద ఏడాదికి రూ.1.5లక్షలు ఇస్తారు. ఏడాదికి 34 ఫ్లైట్ టికెట్స్ ఉచితం. ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏడాదికి ఉచితంగా 50వేల యూనిట్స్ విద్యుత్ & 4వేల కిలో లీటర్ల నీరు పొందొచ్చు. ప్రతినెలా రూ.62వేలు ఆఫీస్ అలవెన్స్, రూ.2లక్షలు హౌసింగ్ అలవెన్స్ వస్తాయి. పదవి పూర్తయ్యాక నెలకు రూ.25వేల పెన్షన్ వస్తుంది.
Similar News
News September 15, 2025
‘మిరాయ్’లో రాముడి రోల్ చేసింది ఎవరంటే?

‘మిరాయ్’లో రాముడి పాత్ర AIతో రూపొందించలేదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ క్యారెక్టర్లో బాలీవుడ్ నటుడు గౌరవ్ బోరా కనిపించారని పేర్కొన్నాయి. హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ చేసిన డెహ్రడూన్కు చెందిన ఈ యాక్టర్ పలు కమర్షియల్ యాడ్స్లోనూ కనిపించారు. అయితే మూవీలో ఫేస్ను రివీల్ చేయకుండా డైరెక్టర్ కార్తీక్ జాగ్రత్తపడ్డారు. అంతకుముందు ఈ రోల్ <<17686798>>ప్రభాస్<<>> కనిపించారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
News September 15, 2025
నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్

అమెరికాలో భారతీయుడి <<17690207>>తల నరికివేసిన<<>> ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘క్యూబాకు చెందిన అక్రమ వలసదారు భార్యాబిడ్డల ముందే చంద్ర నాగమల్లయ్యను కిరాతకంగా చంపేశాడు. అతడు గతంలో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతడిని క్యూబా తమ దేశంలోకి తీసుకునేందుకు నిరాకరించింది. బైడెన్ అసమర్థతతో జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరస్థుడిని కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులను వదలం’ అని హెచ్చరించారు.
News September 15, 2025
స్పీకర్కు అభ్యంతరాలు తెలపనున్న BRS నేతలు

TG: పార్టీ ఫిరాయింపుల నోటీసులకు ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై అభ్యంతరాలు తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలవనున్నారు. ఎమ్మెల్యేల వివరణపై అభ్యంతరాలుంటే మూడ్రోజుల్లోగా తెలపాలని సూచించిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించిన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇవాళ మరిన్ని ఆధారాలు సమర్పించాలని నిర్ణయించింది. నోటీసులు అందుకున్న MLAల్లో కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణ అందజేయాల్సి ఉంది.