News September 7, 2025
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే..

నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్-9 మొదలైంది. తొలి కంటెస్టెంట్‌గా తనూజ(ముద్దమందారం) హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆశా/ఫ్లోరా సైనీ(సినీ నటి), కమెడియన్ ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, సామాన్యుల కోటాలో పడాల పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్‌లో రెండు హౌస్‌లు ఉంటాయని నాగార్జున తెలిపారు. సామాన్యులుvsసెలబ్రిటీలుగా షో సాగే అవకాశం ఉంది. ఈ సారి 15 మందికిపైగా కంటెస్టెంట్లు ఉండనున్నట్లు సమాచారం.
Similar News
News September 8, 2025
మూత్ర విసర్జన ఆపినందుకు కాల్చి చంపాడు

USలో గన్ కల్చర్ తీవ్రతకు అద్దం పట్టే ఘటన ఇది. హరియాణాకు చెందిన కపిల్ (26) రూ.45 లక్షలు ఖర్చు పెట్టి 2022లో డంకీ రూట్ ద్వారా USకు వెళ్లాడు. అక్కడ అరెస్టై లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా బయటకు వచ్చి కాలిఫోర్నియాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శనివారం బహిరంగంగా మూత్రవిసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదం చెలరేగింది. అతడు కాల్పులు జరపడంతో కపిల్ తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలాడు.
News September 8, 2025
ఎరువుల సరఫరాలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష: పొన్నం

TG: ఎరువుల సరఫరా విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని ఫైరయ్యారు. తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తమపై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవమని తెలిపారు.
News September 8, 2025
రూ.20 కోట్ల విలువైన వాచ్ ధరించిన పాండ్య

టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తన విలాసవంతమైన జీవనశైలితో మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్‌లో జరగనున్న ఆసియా కప్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన రూ.20 కోట్ల విలువైన లగ్జరీ వాచ్ ధరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన వాచ్‌లలో ఒకటి. రిచర్డ్ మిల్లె RM 27-04 మోడల్ వాచ్‌లు ప్రపంచంలో మొత్తం 50 మాత్రమే ఉన్నాయి. ఆసియా కప్ (₹2.6CR) ప్రైజ్ మనీ కంటే వాచ్ ధర దాదాపు పది రెట్లు ఎక్కువ.