News January 3, 2025

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జులు వీరే

image

తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జుల్ని నియమించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక బీజేపీ నేత పీసీ మోహన్‌ పేర్లను ప్రకటించింది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని తమిళనాడుకు రిటర్నింగ్ అధికారిగా నియమించింది. బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

Similar News

News January 5, 2025

దివ్యాంగ విద్యార్థులకు నేరుగా అకౌంట్లలోనే పింఛన్: మంత్రి డోలా

image

AP: దివ్యాంగ విద్యార్థులకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. వారికి ప్రతినెలా పింఛన్‌ను నేరుగా అకౌంట్లలోనే జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలను అందిస్తామని తెలిపారు. దివ్యాంగుల కోసం వైజాగ్‌లో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో స్టేడియం నిర్మిస్తామని పేర్కొన్నారు.

News January 5, 2025

ఇంటర్, డిగ్రీ అర్హత.. భారీ జీతంతో ఉద్యోగాలు

image

CBSEలో 212 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. https://www.cbse.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 142 సూపరింటెండెంట్(డిగ్రీ అర్హత), 70 జూనియర్ అసిస్టెంట్(ఇంటర్ అర్హత) ఉద్యోగాలున్నాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ సూపరింటెండెంట్‌కు ₹35,400-₹1,12,400, JAకు ₹19,900-₹63,200 ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

News January 5, 2025

5-15 ఏళ్ల విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు: మంత్రి సత్యకుమార్

image

AP: 45 ఏళ్లు నిండిన గ్రామీణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 5-15 ఏళ్ల విద్యార్థులకు టెస్టులు నిర్వహించి ఫ్రీగా 90వేల కళ్లద్దాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.