News December 13, 2024
అల్లు అర్జున్‌పై పెట్టిన కేసులు ఇవే..

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆయనపై 2 సెక్షన్లలో కేసులు పెట్టారు. BNS 105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ కింద ఆయనకు 5 నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. కాగా ప్రస్తుతం అర్జున్ను వైద్యపరీక్షల కోసం ఉస్మానియా తరలిస్తున్నారు.
Similar News
News January 18, 2026
రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉంది: హరీశ్‌రావు

TG: రేవంత్ డీఎన్ఏలోనే ద్రోహ బుద్ధి ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అవినీతి, ప్రజాద్రోహం కలిస్తే రేవంత్ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ CMగా ఉంటూ కేంద్రంలోని BJPతో చీకటి స్నేహం చేస్తున్నారు. ఆ పార్టీ శత్రువులైన BJP, TDP కూటమికి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజకీయ యాత్ర CBN కనుసన్నల్లో సాగుతోంది. హింసను ప్రేరేపించేలా CM చేసిన కామెంట్లపై డీజీపీ ఏ చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
News January 18, 2026
25న తిరుమలలో రథసప్తమి

సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25న తిరుమలలో రథసప్తమి నిర్వహించనున్నట్లు TTD తెలిపింది. 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారని చెప్పింది. 5.30AM నుంచి 9PM వరకు వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిస్తారని పేర్కొంది. పవిత్ర మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథసప్తమి/మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ రోజు సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది.
News January 18, 2026
మూడో వన్డే.. న్యూజిలాండ్ భారీ స్కోరు

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. మిచెల్(137), ఫిలిప్స్(106) సెంచరీల మోత మోగించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఓ దశలో NZ 58 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోగా మిచెల్-ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 219 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సిరాజ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ తలో 3, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.


