News September 9, 2024

మూడేళ్లలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు వీళ్లే!

image

కోలీవుడ్ స్టార్ హీరో <<14058198>>జయం రవి<<>>, ఆర్తి విడిపోయారు. అయితే కరోనా తర్వాత కొందరు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. అమీర్ ఖాన్ – కిరణ్ రావు, నాగ చైతన్య – సమంత, ధనుశ్ – ఐశ్వర్య, సానియా మీర్జా – షోయబ్ మాలిక్, శిఖర్ ధవన్ – ఆయేషా, హార్దిక్ – నటాషా, నిహారిక – చైతన్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ – ఆలియా సిద్ధిఖీ, హనీ సింగ్ – షాలిని, సోహైల్ ఖాన్ – సీమా సచ్దేవ్, GV ప్రకాశ్- సైంధవి పెళ్లైన కొన్నేళ్లలోనే విడిపోయారు.

Similar News

News March 27, 2026

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

image

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.

News March 27, 2026

IPL జట్లకు ఆదాయం ఎలా వస్తుంది? ఏ టీమ్‌ ఎక్కువ సంపాదించింది?

image

IPLలోని 10 జట్లకు యాడ్స్, మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్స్, టికెట్ విక్రయాల ద్వారా ఆదాయం వస్తుంది. దేశ, విదేశాల్లో ఆడే టోర్నమెంట్స్ వల్ల ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. IPL, ILT20, మేజర్ క్రికెట్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడే KKR 2025లో అత్యధికంగా ₹756Cr సంపాదించింది. తర్వాతి స్థానాల్లో CSK(₹674Cr), MI(₹665Cr), SRH(₹642Cr), RR(₹635Cr), DC(₹603Cr), GT(₹559Cr), RCB(₹504Cr), PBKS(₹471Cr) ఉన్నాయి.

News March 27, 2026

ఇజ్రాయెల్‌కు పాకిస్థాన్ వార్నింగ్

image

టెహ్రాన్‌(ఇరాన్)లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో అమెరికా-ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై పాక్ తీవ్రంగా స్పందించింది. ‘మాది ఖతర్ లాంటి దేశం కాదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించింది. కాగా ఈ దాడుల్లో దౌత్యవేత్తలకు ఎలాంటి హాని కలగలేదు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.