News October 6, 2024

గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు వీరే

image

TGలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గద్వాల – N.శ్రీనివాసులు, MBNR – మల్లు నర్సింహారెడ్డి, వికారాబాద్ – శేరి రాజేశ్‌రెడ్డి, నారాయణపేట్ – వరాల విజయ్, కామారెడ్డి – మద్ది చంద్రకాంత్‌రెడ్డి, సంగారెడ్డి – G.అంజయ్య, వనపర్తి – G.గోవర్ధన్, RR – ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, కరీంనగర్ – సత్తు మల్లయ్య, నిర్మల్ – సయ్యద్ అర్జుమాండ్ అలీ, సిరిసిల్ల – నాగుల సత్యనారాయణ.

Similar News

News February 2, 2026

పాక్ జట్టుకు ఇదేం కొత్త కాదు: సునీల్ గవాస్కర్

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించడంపై సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో స్పందించారు. ‘ముందు ఓ నిర్ణయం తీసుకొని మళ్లీ దాన్ని మార్చుకోవడం పాక్ క్రికెటర్లకు అలవాటే. వారిది యూటర్న్‌ల చరిత్ర. రిటైర్మెంట్ ప్రకటించిన నాలుగు రోజులకే మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. కాబట్టి 15వ తేదీలోపు బాయ్‌కాట్ నిర్ణయంపై కూడా వారు వెనక్కి తగ్గొచ్చు’ అని అభిప్రాయపడ్డారు.

News February 2, 2026

అజిత్ మృతి అనుమానాస్పదమే: MP సంజయ్

image

దివంగత MH Dy CM అజిత్ పవార్ మరణంపై శివసేన MP సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. వెలుగులోకి వస్తున్న అంశాలు చూస్తుంటే విమాన ప్రమాదం సందేహాస్పదంగా ఉందని అన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని, బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. NCP 2వర్గాల విలీనానికి BJP ఒక అడ్డంకి అని ఆరోపించారు. ఈ తరుణంలోనే అజిత్ లాంటి నాయకుడు విమాన ప్రమాదంలో మరణించడంపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

News February 2, 2026

ఆన్‌లైన్ వేధింపులు ఎలా ఎదుర్కోవాలంటే?

image

టెక్నాలజీ పెరిగే కొద్దీ డిజిటల్ ప్రపంచంలో మోసాలూ, మహిళలపై వేధింపులూ పెరుగుతున్నాయి. ఈ విషవలయంలో అతివలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు. తెలిసినవారేనని ఫొటోలు, వీడియోలు పంపకూడదు. పాస్‌వర్డ్‌లు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. థర్డ్‌పార్టీ యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ఆఫ్‌ చేసి ఉంచండి. సైబర్‌ నేరాల బాధితులైతే సహాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930కి డయల్‌ చేయండి.