News September 8, 2025

బిగ్‌బాస్ సీజన్-9 కంటెస్టెంట్లు వీరే..

image

బిగ్‌బాస్ సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కోటాలో తనూజ(ముద్ద మందారం), నటి ఆశా సైనీ, కమెడియన్లు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరీ, నటి సంజనా గల్రానీ, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, సామాన్యుల నుంచి సోల్జర్ పవన్, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీశ్‌ లోనికి వెళ్లారు.

Similar News

News January 30, 2026

ఫామ్‌హౌస్‌లో కుదరదు.. నందినగర్‌లోనే విచారణ: సిట్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అధికారులు తిరస్కరించారు. హైదరాబాద్ నందినగర్ నివాసంలోనే విచారిస్తామని స్పష్టం చేశారు. అయితే రేపు విచారించాల్సి ఉండగా కేసీఆర్ అభ్యర్థనతో విచారణ తేదీని మార్చారు. ఫిబ్రవరి 1న (ఆదివారం) మ.3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలని తాజాగా మరో నోటీసు ఇచ్చారు.

News January 30, 2026

గోల్డ్, సిల్వర్ ఎఫెక్ట్.. మెటల్ స్టాక్స్ ఢమాల్

image

బంగారం, వెండి సహా బేస్ మెటల్స్‌ ధరలు భారీగా తగ్గడంతో ఈరోజు లోహపు షేర్ల విలువలు పడిపోయాయి. హిందూస్థాన్ జింక్ (12%), వేదాంత (11%), NALCO (10%), హిందూస్థాన్ కాపర్ (9.5%), హిందాల్కో (6%), NMDC (4%) స్టాక్స్ వాల్యూస్ కుంగాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఏకంగా 5% పతనమైంది. డాలర్ పుంజుకోవటంతో ఓ దశలో గోల్డ్ ధరలు 9%, సిల్వర్ రేట్లు 15% మేర కరెక్ట్ అయ్యాయి.

News January 30, 2026

బ్లాక్ హెడ్స్‌ను తొలగించే ఇంటి చిట్కాలు

image

బ్లాక్ హెడ్స్‌ను తొలగించడానికి ముందుగా ముఖానికి ఆవిరి పట్టాలి. తర్వాత వెట్ టవల్‌తో సున్నితంగా రుద్దాలి. * పెరుగు, శనగపిండి, కాఫీ పొడి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ మీద రాసి సున్నితంగా మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. * గుడ్డులోని తెల్లసొనలో బేకింగ్ సోడా కలిసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకొని కడిగేసుకోవాలి.