News January 5, 2025
ఒక్క ఎయిర్పోర్ట్ కూడా లేని దేశాలు ఇవే..!

ప్రపంచంలో ఇప్పటికీ 5 దేశాల్లో ఎయిర్పోర్ట్ లేదు. స్థలాభావం, భౌగోళిక పరిస్థితుల వల్ల ఇక్కడ విమానాశ్రయాలను నిర్మించలేదు. వాటికన్ సిటీలో ఎయిర్పోర్ట్ లేదు. ఇక్కడికి సమీపంలోని రోమ్ (ఇటలీ) విమానాశ్రయం నుంచి చేరుకుంటారు. లీచ్టెన్స్టెయిన్ దేశ ప్రజలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ను ఆశ్రయిస్తారు. అండోరా, మొనాకో, శాన్ మారినో దేశాల ప్రజలు పక్క దేశాల్లోని విమానాశ్రయాల నుంచి చేరుకుంటారు.
Similar News
News November 28, 2025
అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2025
స్మృతితో పెళ్లిపై పలాశ్ తల్లి ఏమన్నారంటే..

స్మృతి మంధాన వివాహంపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ పలాశ్ ముచ్చల్ తల్లి అమృత స్పందించారు. త్వరలోనే పెళ్లి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఆ రోజు జరిగిన పరిణామాలపై ఇద్దరూ బాధపడుతున్నారు. మ్యారేజ్ అవగానే స్మృతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేశాం. అనుకోని పరిస్థితులతో వివాహం వాయిదా వేశాం’ అని చెప్పారు. కాగా పెళ్లి సంబంధిత పోస్టులను స్మృతి డిలీట్ చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
News November 28, 2025
జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

జపాన్తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.


