News December 18, 2024

ఈ ఏడాది రిటైర్మెంట్ పలికిన క్రికెటర్లు వీరే!

image

ఈ ఏడాది 20 మందికిపైగా ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. వారిలో అశ్విన్, శిఖర్ ధవన్, బరిందర్ శ్రాన్, వృద్ధిమాన్ సాహా, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, వరుణ్ అరోన్, సౌరభ్ తివారీ, ఎల్గర్, వార్నర్, వాగ్నర్, మున్రో, వీస్, అండర్సన్, మలాన్, మొయిన్ అలీ, మహ్మద్ అమీర్, ఇమాద్ వసీమ్, టిమ్ సౌథీ ఉన్నారు. వీరే కాకుండా ఒక్కో ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పినవారు చాలా మంది ఉన్నారు.

Similar News

News February 5, 2025

రిజర్వేషన్ల కోసమే కులగణన: టీపీసీసీ చీఫ్

image

TG: రిజర్వేషన్ల కోసమే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ‘రాష్ట్రంలో 3.6 శాతం మందే సర్వేలో పాల్గొనలేదు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అలాగే పార్టీలో ఎంతటివారైనా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. రూల్స్ పాటించని వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి’ అని ఆయన హెచ్చరించారు.

News February 5, 2025

పేరు మార్పు: ఫోర్ట్ విలియమ్ ఇకపై ‘విజయ్ దుర్గ్’

image

కోల్‌కతాలోని ఇండియన్ ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పేరును మార్చినట్టు తెలిసింది. ఫోర్ట్ విలియమ్ బదులు ‘విజయ్ దుర్గ్’గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 2023, DECలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిఫెన్స్ మినిస్ట్రీ PR, వింగ్ కమాండర్ హిమాన్షు తివారీ చెప్పారని TOI తెలిపింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇంటర్నల్ కమ్యూనికేషన్లో విజయ్‌దుర్గ్‌నే వాడుతున్నట్టు చెప్పారని వెల్లడించింది.

News February 5, 2025

23న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు

image

AP: శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19- మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. అటు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

error: Content is protected !!