News December 19, 2024
టెన్త్, ఇంటర్ పరీక్షల తేదీలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూళ్లు వచ్చేశాయి.
*ఏపీ టెన్త్: మార్చి 17 నుంచి 31 వరకు
*ఏపీ ఇంటర్: మార్చి 1 నుంచి 19 వరకు ఫస్టియర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్
*తెలంగాణ టెన్త్: మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు
*తెలంగాణ ఇంటర్: మార్చి 5 నుంచి 24 వరకు ఫస్టియర్, మార్చి 6 నుంచి 25 వరకు సెకండియర్
>> పరీక్షలు రాసే విద్యార్థులకు WAY2NEWS తరఫున ALL THE BEST
Similar News
News January 2, 2026
మరోసారి కనిపించిన కిమ్ కుమార్తె.. వారసత్వానికి సంకేతాలా?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి ‘కుమ్సుసన్’ స్మారకాన్ని సందర్శించి దేశ మాజీ నేతలకు నివాళులు అర్పించారు. గత మూడేళ్లుగా తండ్రితో పాటు అధికారిక కార్యక్రమాల్లో జు యే పాల్గొంటుండటంతో ఆమెను వారసురాలిగా స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇటీవల చైనా పర్యటనలోనూ కనిపించారు.
News January 2, 2026
NGRIలో ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే సమయం

హైదరాబాద్లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(NGRI)లో 13 సెక్యూరిటీ ఆఫీసర్, MTS పోస్టులకు అప్లై చేయడానికి 3రోజులే(జనవరి 5) సమయం ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు ఎక్స్సర్వీస్మన్, ఎంటీఎస్ పోస్టులకు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్ట్/రాత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. వెబ్సైట్: https://www.ngri.res.in/
News January 2, 2026
ఈ మార్పులతో 2026ని హెల్తీగా మార్చుకోండి!

జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ ఏడాది హెల్తీగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ‘ప్రతిరోజూ వ్యాయామం, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ 7-8 గంటలు నిద్రపోవాలి. జంక్ ఫుడ్, స్మోకింగ్, డ్రింకింగ్కు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బీపీ, షుగర్ టెస్టులు చేయించుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్తో ఒత్తిడి తగ్గించుకోండి. కండరాల బలాన్ని పెంచుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందవచ్చు’ అని వైద్యులు చెబుతున్నారు.


